S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/27/2018 - 02:27

న్యూఢిల్లీ, జనవరి 26: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శుక్రవారం నాడు 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రాల రాజధానుల్లో గవర్నర్లు జాతీయ పతాకాలను ఆవిష్కరించి, తమ తమ రాష్ట్రాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని వర్గాల వారూ అంకిత భావంతో ముందుకు కదలాలని పిలుపునిచ్చారు.

01/27/2018 - 02:25

న్యూఢిల్లీ, జనవరి 26: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించలేకపోయిందని ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కు గౌరవ అతిథుల వేదికపై ఆరో వరుసలో స్థానం కల్పించి కేంద్రం దిగజారుడు రాజకీయం ప్రదర్శించిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

01/27/2018 - 02:23

శ్రీనగర్, జనవరి 26: పుణెకు చెందిన ఓ మహిళను సూసైడ్ బాంబర్‌గా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తుండగా గురువారం రాత్రి ఓ మహిళ అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు గుర్తించారు. దక్షిణ కాశ్మీర్‌లో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

01/27/2018 - 02:23

న్యూఢిల్లీ, జనవరి 26: ఆసియాన్ దేశాల కూటమికి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించడం ద్వారా భారత్ దృఢమైన సంబంధాలను పాదుగొల్పడానికి చొరవ చూపింది. పది ఆసియాన్ దేశాల్లోని ఒక్కొక్కరికీ నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.

01/27/2018 - 02:21

న్యూఢిల్లీ, జనవరి 26: ఇక్కడి రాజ్‌పథ్‌లో శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మహిళల మోటార్‌సైకిల్ రెజిమెంటు ప్రదర్శించిన విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘సీమా భవానీ’గా బిఎస్‌ఎఫ్‌లో ఏర్పాటైన ఈ రెజిమెంటులోని 113 మంది మహిళా సైనికులు చేసిన ‘బైక్ స్టంట్స్’ అందరినీ అలకరించాయి. ఆసియాన్‌కు చెందిన పదిమంది దేశాధినేతలు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

01/27/2018 - 02:19

న్యూఢిల్లీ, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మిలటరీ అవార్డులను ప్రదానం చేస్తూ రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఒక్కసారి ఉద్వేగానికి లోనయ్యారు. రాష్టప్రతి భవన్‌లో ఆయన శుక్రవారం నాడు ప్రెసిడెంట్ మెడల్స్‌ను ప్రదానం చేశారు. సైనికులకు ఇచ్చే అత్యున్నత అవార్డు ‘అశోక చక్ర’ను దివంగత జ్యోతిప్రకాశ్ నిరాలా కుటుంబ సభ్యులకు అందజేసినపుడు రాష్టప్రతి కంటతడి పెట్టారు.

01/27/2018 - 01:21

వేనవేల వెలుగుల కాంతిపుంజం.. శతకోటి ఆశల మణిహారం గణతంత్ర వైభవం.. చరిత్రను కళ్లకు కడుతూ, సంప్రదాయానికి ఉద్దీపన పడుతూ, సాంస్కృతిక ప్రాభవానికి దివిటీ పడుతూ సాగిన 69వ రిపబ్లిక్ పరేడ్ అనేక కోణాల్లో చారిత్రకం. పది ఆసియాన్ దేశాల నేతలు ముఖ్య అతిధులుగా తరలిరావడం ఒక ప్రత్యేకత అయితే భిన్న రంగాలు సాధించిన విజయాలు నిరుపమానంగా కళ్లకు కట్టడం మరో ఆకర్షణ.

01/26/2018 - 03:59

జనగణతంత్రపు మంత్రము
మనములనొక్కటిగజేయ మహిమాన్వితమై
జనగణమన పాడుకొనుచు
జనులందరు గొంతులెత్తి జైహిందనరే!

01/26/2018 - 02:58

శుక్రవారం జరగబోయే గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శన ఇచ్చేందుకు పూర్తిస్థాయ రిహార్సల్స్ చేస్తున్న అమృత్‌సర్‌కు చెందిన పాఠశాల విద్యార్థినులు...
గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథులుగా విచ్చేసిన ఆసియాన్ దేశాధినేతలతో కలిసి అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.

01/26/2018 - 02:56

న్యూఢిల్లీ, జనవరి 25: బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువని టీ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి మరీ చెప్పారు.

Pages