S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/28/2018 - 02:39

న్యూఢిల్లీ, జనవరి 27: పాతికేళ్ల ఉద్యోగ జీవితంలో చిత్తశుద్ధిని ప్రదర్శించి, సుమారు 962 కోట్ల రూపాయల మేరకు పన్ను ఎగవేత కేసులను పరిష్కరించిన అధికారికి రాష్టప్రతి అవార్డు దక్కింది. వస్తు సేవా పన్ను (జీఎస్టీ) డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో ఇంటెలిజన్స్ అధికారిగా పనిచేస్తున్న రవిదత్ శంకర్ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తారు. 1992 నుంచి వివిధ స్థాయిల్లో పనిచేసి ఇంటెలిజన్స్ అధికారిగా పదోన్నతి పొందారు.

01/28/2018 - 02:39

ముంబయి, జనవరి 27: మినీ బస్సు ఒకటి మహారాష్టల్రోని పంచగంగ నదిలో పడిపోయిన సంఘటనలో 13 మంది మృతిచెందారు. బస్సులో 17 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి 11.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మూడు కుటుంబాలు విహారయాత్రకు వెళ్ళి, గణపతిపూలే నుంచి తిరిగి వస్తుండగా కొంకణ్ తీరంలో ఈ ప్రమాదం జరిగింది. మరణించినవారిలో ముగ్గురు స్ర్తిలు, ముగ్గురు పురుషులు కాగా ఏడుగురు పిల్లలున్నారు.

01/28/2018 - 02:36

శ్రీనగర్, జనవరి 27: హింసకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు కాల్పులు జరపగా ఇద్దరు పౌరులు మరణించిన ఘటన జమ్మూ కాశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలో శనివారం జరిగింది. భద్రతా దళాలకు చెందిన వాహన శ్రేణిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వగా వారిని అదుపు చేసేందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. గనొవ్‌పుర గ్రామం వద్ద సైనికుల వాహనాలను స్థానికులు అడ్డుకుని రాళ్ల వర్షం కురిపించారు.

01/28/2018 - 02:35

కంబోడియా ప్రధాన మంత్రి హన్ సేన్ శనివారం భారతదేశ పర్యటనకు వచ్చారు. ఆయనకు ఢిల్లీలో అధికార లాంఛనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

01/28/2018 - 02:32

మళప్పురం, జనవరి 27: దేవునికి ప్రార్థన చేయాలంటే భక్తి ప్రధానం తప్ప లింగభేదం ఉండదని నిరూపించే అరుదైన సంఘటన కేరళలో చోటుచేసుకుంది. మళప్పురం జిల్లా ఛెరుకోడెలో ఓ మసీదులో 34 ఏళ్ల ముస్లిం మహిళ ఆధ్వర్యంలో నమాజు జరిగింది. ఇలా జరగడం దేశంలోనే ప్రప్రథమం. ఖురాన్ సన్నాత్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జామిదా (34) శుక్రవారం మసీదులో నమాజుకు నాయకత్వం వహించారు.

01/28/2018 - 02:31

కాస్‌గంజ్ (యూపీ), జనవరి 27: ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో శుక్రవారం మొదలైన అల్లర్లు శనివారం కూడా కొనసాగాయి. పోలీసులు కాస్‌గంజ్ ప్రాంతంలో కర్ఫ్యూ విధించినప్పటికీ రెండు షాపులను, ఒక బస్సును ఆందోళనకారులు తగులబెట్టారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా వీహెచ్‌పీ-ఏబీవీపీ కార్యకర్తలు నిర్వహించిన బైక్‌ర్యాలీ మధుర-బరేలీ హైవేపై వెళుతుండగా గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు.

01/28/2018 - 02:27

న్యూఢిల్లీ, జనవరి 27: విధానపరమైన సంస్కరణల వల్లనే అవినీతిని రూపుమాపలేమని, ప్రజల ఆలోచనా విధానాల్లోనూ మార్పు రావాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం ఇక్కడ ఓ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ, దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలను ఎవరూ ప్రశ్నించజాలరని అన్నారు.

01/28/2018 - 02:24

హైదరాబాద్, జనవరి 27: భారతీయ కళలను, సంస్కృతిని ప్రోత్సహించే టి. సుబ్బరామిరెడ్డి జాతీయ స్థాయిలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత యశ్‌చోప్రాతో ఆయనది ఎనలేని బంధం. ఆ అనుబంధంతోనే యశ్‌చోప్రా తనువు చాలించిన తర్వాత సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ తరఫున 2013 నుండి నేషనల్ యశ్‌చోప్రా మెమోరియల్ అవార్డును సినీ ప్రముఖులకు అందజేస్తున్నారు.

01/28/2018 - 01:26

న్యూఢిల్లీ, జనవరి 27: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయ. బీజేపీని ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతుంటే ప్రతిపక్షాలను ఇరకాటంలో పడవేసేందుకు బీజేపీ వ్యూహం సిద్ధం చేస్తోంది.

01/27/2018 - 03:26

న్యూఢిల్లీ, జనవరి 26: దేశ రాజధానిలోని రాజ్‌పథ్‌లో 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం నేత్రపర్వంగా జరిగాయి. రాష్టప్రతి పదవిని చేపట్టాక రామ్‌నాథ్ కోవింద్ ఈ వేడుకల్లో తొలిసారిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సైనిక వందనం స్వీకరించారు. ఆసియాన్ దేశాలకు చెందిన పదిమంది అగ్రనేతలు హాజరు కావడం ఈసారి గణతంత్ర దినోత్సవాల్లో ఓ ప్రత్యేకత.

Pages