S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/29/2018 - 02:55

న్యూఢిల్లీ, జనవరి 28: కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు నిధులు అందజేసిన వారిపై విచారణ జరిపేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సమాయత్తమవుతోంది. ఈ కేసు దర్యాప్తు చేసే బాధ్యతను ఢిల్లీ పోలీసుల నుంచి ఎన్‌ఐఏ స్వీకరించింది. హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన ఉగ్రవాది నజీర్ సఫీ మీర్ కాశ్మీర్‌లోని హురియత్ నేతలకు నిధులు అందజేశాడన్న ఆరోపణలపై గతంలోనే కేసు నమోదైంది.

01/29/2018 - 02:54

లక్నో, జనవరి 28: వచ్చే ఏప్రిల్‌లో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన యూపీలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో ఇపుడు రాజ్యసభ సీట్లను సునాయాసంగా గెలిచే పరిస్థితి ఉంది.

01/29/2018 - 02:15

న్యూఢిల్లీ, జనవరి 28: విభజన హామీల అమలు విషయంలో పార్లమెంట్‌లో శాంతించేది లేదని తెరాస పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీల ఎంపీలతో ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెరాస పార్టీనుంచి జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతంరం తెలంగాణ భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ బడ్జెట్‌లో

01/29/2018 - 03:15

న్యూఢిల్లీ, జనవరి 28: అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాకే ‘ట్రిపుల్ తలాక్ బిల్లు’కు చట్టబద్ధత కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభలో ఎలాగైనా గట్టెక్కించాలన్న వ్యూహంతో అధికార పక్షం తీవ్ర కసరత్తు చేస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

01/29/2018 - 02:01

న్యూఢిల్లీ, జనవరి 28: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను అమలుచేయాలని అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నేటినుంచి పార్లమెంట్ సమావేశాలు సజావుగా కొనసాగించేందుకు పార్లమెంట్‌లోని అన్ని పార్టీల నాయకులతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత కుమార్ నేతృత్వంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది.

01/29/2018 - 01:07

న్యూఢిల్లీ, జనవరి 28: అవినీతి, నల్లధనంపై తాను చేస్తున్న పోరాటంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఇప్పటికే జైలుకు చేరారని ఆయన వ్యాఖ్యానిస్తూ, ఎన్ని సవాళ్లు ఎదురైనా తన పోరు ఆగదన్నారు. ఇక్కడ ఆదివారం జరిగిన ఎన్‌సీసీ ర్యాలీలో ఆయన మాట్లాడారు.

01/28/2018 - 03:52

న్యూఢిల్లీ, జనవరి 27: ఈ ఏడాదికి సంబంధించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ప్రారంభించారు. అయిదేళ్లలోపు బాలలకు రాష్టప్రతి భవన్‌లో పోలియో చుక్కలను వేసి ఈ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. జాతీయ రోగనిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

01/28/2018 - 02:41

చెన్నై, జనవరి 27: తమిళనాట అధికార అన్నాడీఎంకే అధినాయకత్వం పార్టీని చక్కదిద్దే పనిలో పడింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ప్రత్యర్ధి టీటీవీ దినకరన్ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఓ పన్నీర్ సెల్వం, కే పళనీస్వాని పార్టీపై పట్టుసడలిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం 140 మంది ఆఫీసు బేరర్లను పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

01/28/2018 - 02:41

శ్రీనగర్, జనవరి 27: గత రెండు నెలలుగా గడ్డకట్టేసిన కాశ్మీరం క్రమంగా కరుగుతోంది. హిమనీనదాలతో బిగుసుకుపోయిన ఈ అతిశీతల ప్రాంతాన్ని తేజోమయ కిరణాలతో సూర్యుడు క్రమంగా కరిగిస్తున్నాడు. క్రమంగా మారుతోన్న ఉష్ణోగ్రతలతో కాశ్మీరీలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, అతి తీవ్రమైన చలి గాలులను మరో రెండు రోజులపాటు భరించక తప్పదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

01/28/2018 - 02:40

గుర్గావ్, జనవరి 27: సంజయ్‌లీలా భన్సాలీ చిత్రం పద్మావత్‌కు వ్యతిరేకంగా హింసకు దిగిన 38 మందిని గుర్గావ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దాడులకు దిగిన 24 మంది, శాంతి భద్రతలు భగ్నం చేసిన 14 మందిని అరెస్టు చేసినట్టు పోలీసు ప్రతినిధి రవీందర్ కుమార్ వెల్లడించారు. ఐపీసీలోని 107/151 సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు.

Pages