S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/10/2018 - 02:06

న్యూఢిల్లీ, జనవరి 9: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇటీవల ఆంధ్రా, తెలంగాణ నాయకులు చేసిన విమర్శలపై ఢిల్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ- కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థల్లాంటివి వస్తాయని, అవన్నీ సర్దుకుపోతాయని అన్నారు.

01/10/2018 - 01:56

న్యూఢిల్లీ, జనవరి 9: గవర్నర్ల వ్యవస్థలో సంస్కరణలపై నియమించిన ఉమ్మడి రాష్టల్ర గవర్నర్ నరసింహన్ నేతృత్వలోని కమిటీ నివేదికను మంగళవారం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేసింది.

01/10/2018 - 01:41

సూళ్లూరుపేట, జనవరి 9: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమైంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి ఈ నెల 12న పిఎస్‌ఎల్‌వి-సి 40 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో జరగనుంది.

01/10/2018 - 01:40

న్యూఢిల్లీ, జనవరి 9: తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్‌కు నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా అధ్యక్షతన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన సదస్సులో లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆహార భద్రత, నాణ్యత, ప్రమాణాలపై చర్చించారు.

01/10/2018 - 01:36

న్యూఢిల్లీ, జనవరి 9: ఇతర దేశాల్లో మరణదండన విధించే పద్ధతులు ఎలా ఉన్నాయో ఆరా తీసి వివరాలు తమకు తెలియజేయాలంటూ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ‘్ఫలానా పద్ధతిలోనే మరణశిక్షను అమలు చేయాల’ని తాము ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

01/10/2018 - 01:35

న్యూఢిల్లీ, జనవరి 9: మీడియా స్వేచ్ఛను హరించకూడదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విలేఖర్ల భావస్వేచ్ఛ హక్కుకు భంగం కలిగించకుండా కొనసాగనీయాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అప్పుడప్పుడు తప్పుడు వార్తా కథనాలు వచ్చినంతమాత్రాన మీడియాకు కళ్లెం వేయడం సరికాదని బెంచ్ పేర్కొంది.

01/10/2018 - 01:34

ఐజ్వాల్, జనవరి 9: మిజోరం శిబిరాల్లో తలదాచుకుంటున్న మయన్మార్ శరణార్థులు వెనక్కి తిరిగి వెళ్లేందుకు ఇష్టపడటం లేదని ఇక్కడి అధికారులు వెల్లడించారు. మయన్మార్‌లో సైన్యం, అర్కాన్ ఆర్మీ మిలిటెంట్ల మధ్య ఘర్షణ సమయంలో 1600మంది శరణార్థులు మిజోరం శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

01/10/2018 - 01:34

ఉజ్జయినీ, జనవరి 9: కెపాసిటీకి మించి ప్రయాణికులను తీసుకువెళ్తున్న ఓ జీపు టైరు పేలి పల్టీలు కొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. మరో 37మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడికి 60 కి.మీ దూరంలోని రునిజా గ్రామంలో ఓ పెట్రోల్ బంకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 14మంది ప్రయాణించాల్సిన జీపులో 41మంది ప్రయాణిస్తుండటం టైరు పేలడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది.

01/10/2018 - 01:18

న్యూఢిల్లీ, జనవరి 9: థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించడం తప్పనిసరికాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించేటప్పుడు ప్రేక్షకులు లేచి నిలబడాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడా నిర్ణయాన్ని వెనక్కితీసుకుంటున్నట్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పును వెలువరించింది.

01/10/2018 - 01:15

న్యూఢిల్లీ, జనవరి 9: భారత దేశం మొదటినుంచీ అంతర్జాతీయ వ్యవహారాల్లో నిర్మాణాత్మకమైన పాత్రనే పోషిస్తూ వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మహాత్మాగాంధీ ప్రవచించిన అహింసా సిద్ధాంతం ఉగ్రవాదానికి, అతివాదానికి విరుగుడని స్పష్టం చేశారు.

Pages