S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/09/2018 - 04:07

ఏమిటీ ఆకాశంలో వింత జంతువులు అంటూ ఆశ్చర్యపోతున్నారా.. అదేం కాదు.. అవన్నీ గాలిపటాలే.. అహ్మదాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ పతంగుల పండగలో ఔత్సాహికులు తయారు చేసిన నమూనాలవి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆదివారం ఈ పతంగుల పండుగను ప్రారంభించారు.

01/09/2018 - 04:05

పాకిస్తాన్ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన 147 మంది భారత జాలర్లు సోమవారం వాఘా సరిహద్దు దాటి భారత్‌లో ప్రవేశించిన అనంతరం మాతృభూమికి మొక్కుతున్న దృశ్యం.

01/09/2018 - 02:53

ఉదయ్‌పూర్ (రాజస్థాన్), జనవరి 8: చట్టసభల్లో తమ పార్టీ సభ్యులను నియంత్రించడమే కాదు, వారిని చైతన్యవంతం చేయడం విప్‌ల బాధ్యత అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి అనంత్‌కుమార్ పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 18వ అఖిల భారత విప్‌ల సదస్సును సోమవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత ఉత్తమమైనదని అన్నారు.

01/09/2018 - 02:50

న్యూఢిల్లీ, జనవరి 8: దేశవ్యాప్తంగా అమలవుతున్న విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను అగ్రవర్ణ పేదలకూ వర్తింపజేయాలని, అందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఫరీదాబాద్‌లో జరిగిన ఆల్ ఇండియా యాంటీ రిజర్వేషన్ ఫ్రంట్ నిర్వహించిన సదస్సులో కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.

01/09/2018 - 02:49

న్యూఢిల్లీ, జనవరి 8: దేశ రాజధానిలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా జి.అశోక్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ అదనపురెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి, సహాయక కమిషనర్ జి.రామ్మోహన్, తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. 1991 సివిల్ సర్వీసెస్ కేడర్‌కు చెందిన అశోక్ కుమార్ దేశంలో వివిధ విభాగాల్లో అనేక హోదాల్లో పనిచేశారు.

01/09/2018 - 02:49

రాంచీ, జనవరి 8: పశుదాణా కేసులో శిక్షపడి ప్రస్తుతం జైలులో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ కోసం ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. కొద్ది రోజుల్లోనే లాలూ తరఫున బెయిల్ పిటిషన్ వేస్తానని ఆయన తరఫు న్యాయవాది ప్రభాత్‌కుమార్ సోమవారం మీడియాకు తెలిపారు.

01/09/2018 - 02:48

న్యూఢిల్లీ, జనవరి 8: విద్యుత్ ఉద్యోగులు వయో పరిమిత పెంపు కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలకు నోటీసులు జారీ చేసింది.

01/09/2018 - 02:47

న్యూఢిల్లీ, జనవరి 8: హజ్ యాత్రకు వెళ్లే భారతీయులకు దూర, భారం తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. సౌదీ అరేబియా హజ్, ఉమ్రాహ్ మంత్రి మహ్మద్ సలేహ్ బిన్ తహెర్ బెంటన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మధ్య ఆదివారం మక్కాలో యాత్రకు సంబంధించిన ద్వైపాక్షిక వార్షిక ఒప్పందం కుదిరింది.

01/09/2018 - 02:08

న్యూఢిల్లీ, జనవరి 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ ఏడాది జరుగనున్న ఎనిమిది రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2018 వార్షిక ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

01/09/2018 - 02:00

న్యూఢిల్లీ, జనవరి 8: మహాత్మాగాంధీ హత్య విషయంలో కుట్ర కోణానికి సంబంధించి గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. మహాత్ముడి హత్య వెనుక కుట్ర, ఆయనను హత్యచేసిన వ్యక్తి నాథూరాం వినాయక్ గాడ్సేలను గుర్తించడం జరిగిందని, దీని దృష్ట్యా ఈ కేసును పునర్విచారించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని మంగళవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది.

Pages