S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/09/2018 - 00:08

టెకన్పూర్ (మధ్యప్రదేశ్), జనవరి 8: సైబర్ నేరాలు, సామాజిక మీడియాలో ఎదురయ్యే సమస్యలపై దృష్టి సారించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఇక్కడి బిఎస్‌ఎఫ్ అకాడమీలో సోమవారం జరిగిన డీజీపీలు, ఐజీపీల మూడు రోజుల సదస్సు ముగింపు ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, సైబర్ నేరాలపై తక్షణం దృష్టిసారించి, వాటిని పరిష్కరించేందుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

01/09/2018 - 00:05

న్యూఢిల్లీ, జనవరి 8: ఆధార్ కార్డుల వివరాల గోప్యతకు సంబంధించి వార్త రాసిన విలేఖరి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పత్రికా స్వేచ్ఛకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర ఐటీ శాఖామంత్రి రవిశంకర ప్రసాద్ ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. భారత్ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేసే ఆధార్ గోప్యతను, పవిత్రతను కాపాడడమే తమ బాధ్యత అన్నారు.

01/08/2018 - 04:30

న్యూఢిల్లీ, జనవరి 7: సూపర్‌స్టార్ రజనీకాంత్ కొద్దిరోజుల క్రితం రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటిస్తూ యోగ ముద్రను పోలిన చేతిని చూపించటం ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ‘అప్నా ముద్ర’గా రజనీ ప్రదర్శించిన స్టయిల్ వరకూ ఓకే. కాకపోతే, ‘ఆయన ఎంపిక చేసుకున్న పార్టీ చిహ్నం తమ కంపెనీ యాంబ్లమ్‌కు చాలా దగ్గరగా ఉందన్నది సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ వోక్స్‌వెబ్ వాదన.

01/08/2018 - 04:29

న్యూఢిల్లీ, జనవరి 7: భారత్-మైన్మార్ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో ఈ ప్రకంపనలు నమోదయ్యాయని జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం తెలిపింది. మధ్యాహ్నం 12.17 గంటలకు భూతలానికి 35 కి.మీ. లోతులో ఈ ప్రకంపనలు నమోదయ్యాయని వెల్లడించింది.

01/08/2018 - 04:27

న్యూఢిల్లీ, జనవరి 7: డబ్బులు చెల్లిస్తే ఆధార్ సమాచారం వాట్సప్ ద్వారా బయటకు వస్తుందని వార్తను ప్రచురించిన పత్రికపై చండీగఢ్‌లో కేసు నమోదైంది. ఆ వార్త రాసిన పత్రిక, పాత్రికేయుడిపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చండీగఢ్ అధికారులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధార్ సమాచారం లీకేజీపై తప్పుడు వార్తలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

01/08/2018 - 04:26

మీరు ఊహించింది నిజమే.. ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథే. కాషాయ వస్త్రాలతో ఎప్పుడూ సాదాసీదాగా కనిపించే యోగికి ఈ కిరీటాలు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా!
ఆదివారం బెంగళూరులో బీజేపీ నిర్వహించిన పరివర్తన ర్యాలీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సాంప్రదాయకమైన కిరీటాన్ని, మెడలో హారాన్ని అలంకరించారు.

01/08/2018 - 04:24

పాట్నా, జనవరి 7: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఆయన జైల్లో చేం చేస్తారు అనే దానిపై ఆసక్తికరమైన కథనాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష కాలంలో బెర్సాముండా జైల్లో ఆయన తోటమాలిగా పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ పని చేసినందుకుగాను ఆయన రోజుకు 93 రూపాయల జీతం ఇస్తారని ప్రభాత్ కభర్ అనే పత్రిక వెల్లడించింది.

01/08/2018 - 04:20

న్యూఢిల్లీ, జనవరి 7: జాతి నిర్మాణంలోను, అభివృద్ధిలోను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌కు చెందిన అధికారులు ఏ మేరకు తోడ్పడుతున్నారన్న దానిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఓ పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి స్పష్టం చేసింది. అలాగే వీరి జీతభత్యాలకు సంబంధించి ఎంత ఖర్చవుతోందని కూడా కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్రం అందజేయకపోవడం పట్ల ఈ ప్యానెల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

01/08/2018 - 04:19

కులాయి (త్రిపుర), జనవరి 7: త్రిపుర ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని, చిట్‌ఫండ్ కుంభకోణాల్లో చాలామంది మంత్రులకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని అమిత్ షా ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే వీరందరినీ జైలుకు పంపుతుందని హెచ్చరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సీపీఎంను గద్దె దించాలని ఆదివారం ఇక్కడ జరిగిన ర్యాలీలో అమిత్ షా పిలుపునిచ్చారు.

01/08/2018 - 04:18

పూలవనంలా కనిపిస్తున్నా.. వీళ్లంతా విద్యార్థులే. యోగాభ్యాసి మండల్ స్వామి 125వ జయంతి సందర్భంగా విద్యార్థులకు యోగ సాధనతోపాటు పోటీలనూ నిర్వహించారు. వేలాదిగా పిల్లలు తరలివచ్చి ఇలా వరుసలో కూర్చుని యోగాభ్యాసం చేశారు. మహారాష్ట్ర నాగపూర్‌లోని యశ్వంత్ స్టేడియంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది.

Pages