S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/07/2018 - 01:34

రాంచీ, జనవరి 6: పశుదాణా కుంభకోణం కేసులో దోషులకు రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎట్టకేలకు శనివారం సాయంత్రం శిక్షలను ఖరారు చేసింది. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ (69)కు ఈ కేసులో మూడున్నరేళ్ల కారాగార వాసాన్ని, పదిలక్షల రూపాయల జరిమానాను విధిస్తూ సీబీఐ కోర్టు న్యాయమూర్తి శివ్‌పాల్ సింగ్ తీర్పును ప్రకటించారు.

01/06/2018 - 03:58

చలిగాలులు కార్మికుడి కడుపాకలిని చల్లార్చలేవు. మండుటెండైనా.. మంచు కొండలైనా కార్మికుల రెక్కల కష్టం కింద నక్కి ఉండాల్సిందే. అలహాబాద్‌లో కనిపించిన మంచు చిత్రాలివి. శీతల పవనాలు.. ఉత్తరాదిన రైళ్లను రద్దు చేయగలిగాయి కానీ, ఈ కార్మికుడి సైకిల్ యాత్రను అడ్డుకోలేకపోయాయని చెప్పడానికి మొదటి చిత్రమే ఉదాహరణ. ఆకలి సెగ తగ్గితే అంతటి కార్మికులకూ ఇలా రగ్గుల మాటున ఒగ్గక తప్పదనడానికి రెండో చిత్రం సాక్షి.

01/06/2018 - 03:13

కోల్‌కతా, జనవరి 5: మైన్మార్‌లో సైనిక దాడులకు భయపడి తమ దేశానికి వలస వచ్చిన రోహ్యింగాలను తిరిగి స్వదేశానికి పంపే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని బంగ్లాదేశ్ సమాచార మంత్రి హసానూల్ హక్ వెల్లడించారు. రోహింగ్యా శరణార్థులందరినీ మైన్మార్ పంపుతామన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. గత నవంబర్‌లో చోటుచేసుకున్న సైనిక చర్యతో వేలాది మంది రోహ్యింగాలు బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చారు.

01/06/2018 - 02:58

న్యూఢిల్లీ, జనవరి 5: రాష్ట్రాలకు హజ్ యాత్రీకుల కోటా పంపకాలకు సంబంధించి ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో చెప్పాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. హజ్ కోటా పంపకాల్లో కేంద్రం అనుసరిస్తున్న విధానం రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతున్నట్టుందని కేరళ హజ్ కమిటీ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం విచారించింది.

01/06/2018 - 02:57

న్యూఢిల్లీ, జనవరి 5: విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పొన్ను రాధాకృష్ణన్ వెల్లడించారు. విభజన నాటి ఏపీ, ప్రస్తుత ఏపీ ఆర్థిక స్థితిగతులపై వైకాపా లోక్‌సభ సభ్యుడు వై.వి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి పొన్ను రాధాకృష్ణన్ శుక్రవారం నాడు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

01/06/2018 - 02:56

న్యూఢిల్లీ, జనవరి 5: ‘ఆధార్’ సమాచారం పూర్తి భద్రతతో ఉందని, అది దుర్వినియోగమయ్యే అవకాశమే లేదని ‘విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ’ (యుఐడీఏఐ) ప్రకటించిన మర్నాడే- ‘ఆధార్’ సమచారం దుర్వినియోగమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ అమెరికాకు చెందిన విమర్శకుడు ఎడ్వర్డ్ స్నోడెన్ తన వాదన వినిపించారు.

01/06/2018 - 02:55

రాంచీ, జనవరి 5: పశుదాణా కేసులో ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా నిర్థారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం, శిక్షల తీర్పుపై మాత్రం వాయిదాల పర్వం కొనసాగిస్తోంది. డిసెంబర్ 23న లాలూను దోషిగా నిర్థారించిన సీబీఐ కోర్టు, జనవరి 3న శిక్షలను ఖరారు చేయాల్సి ఉంది. కొన్ని కారణాలతో తీర్పు వాయిదా పడటంతో, లాలూకు శుక్రవారం శిక్షలు ఖరారు చేస్తారని అనుకున్నారు.

01/06/2018 - 02:55

న్యూఢిల్లీ,జనవరి 5: కాకినాడ-పిఠాపురం రైల్వేలైన్ సమస్యను పరిష్కరించాలని కేంద్రమంత్రి పియూష్‌గోయల్‌కు భాజపా ఎంపీ కంభంపాటి హరిబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు హరిబాబు నేతృత్వంలో పిఠాపురం భాజపా నాయకుల బృందం కేందమంత్రి పియూష్ గోయల్‌ను కలిశారు. ఈ లైన్‌కి ఇప్పటి వరకు రూ.25 కోట్లు ఖర్చుపెట్టారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

01/06/2018 - 02:54

ఇండోర్, జనవరి 5: ఓ స్కూల్ బస్సు ట్రక్కును ఢీకొన్న ఘటనలో అయిదుగురు విద్యార్థులు, బస్సు డ్రైవర్ మరణించారు. మధ్యప్రదేశ్‌లో ఇండోర్ వద్ద బైపాస్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు ట్రక్కును ఢీకొనగా అయిదుగురు విద్యార్థులు సహా బస్సు డ్రైవర్ మృతిచెందినట్లు ఇండోర్ డిఐజి హరినారాయణ్ చారి మిశ్రా తెలిపారు.

01/06/2018 - 02:54

పుదుచ్చేరి, జనవరి 5: సంక్షేమ పథకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడికి సవాల్ విసిరారు. పథకాల అమలులో అక్రమాలు జరిగాయంటూ ప్రధానమంత్రికి ఆమె లేఖ రాశారని, నిజానిజాల నిగ్గు తేల్చాలంటే సమగ్ర విచారణ జరిపించాలని ఆయన అన్నారు. లేఖలు రాయడం కాదు, దర్యాప్తు జరిపిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు.

Pages