S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/08/2018 - 04:15

తేకన్‌పూర్ (మధ్యప్రదేశ్), జనవరి 7: నక్సల్ పీడిత ప్రాంతాలు, జమ్ముకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు సహా దేశంలోని భద్రతా వ్యవస్థను అవసరానుగుణంగా మరింతగా శక్తివంతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన 250 మంది డిజిపిలు, ఐజిపిలనుద్దేశించి ఆదివారం నాడిక్కడ జరిగిన కీలక భద్రతా భేటీలో మోదీ మాట్లాడారు.

01/08/2018 - 01:59

కోల్‌కతా, జనవరి 7:మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సరాను వేధిస్తూ పెళ్లి చేసుకోక పోతే కిడ్నాప్ చేస్తానని బెదిరించిన ఓ ఆగంతకుడ్ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. 32 సంవత్సరాల దేవ్ కుమార్ అనే ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇతర వివరాలను సేకరిస్తున్నారు. అసలు సచిన్ ల్యాండ్‌లైన్ నెంబర్ అతడికి ఎలా లభించిందన్నదానిపైనా ఆరా తీస్తున్నారు.

01/07/2018 - 02:44

శ్రీనగర్, జనవరి 6: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. అత్యంత శక్తిమంతమైన ఐఈడీ బాంబును సోపోర్ టౌన్‌షిప్‌లో శనివారం ఉదయం ఉగ్రవాదులు పేల్చడంతో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. సోపోర్‌లోని గోల్ మార్కెట్‌లోని ఓ దుకాణం అడుగుభాగంలో ఈ బాంబును ఉగ్రవాదులు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు.

01/07/2018 - 02:43

న్యూఢిల్లీ, జనవరి 6: రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతిపై మనీలాండరింగ్ అభియోగాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం మరో చార్జిషీటు దాఖలు చేసింది. 8వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలకు సంబంధించి మీసా భారతి, ఆమె భర్త శైలేష్‌కుమార్‌తో పాటు మరికొందరిపైనా ఈమేరకు ఢిల్లీలోని పటియాలా కోర్టులో రెండో చార్జిషీటు దాఖలైంది.

01/07/2018 - 02:39

న్యూఢిల్లీ, జనవరి 6: ప్రధాని నరేంద్రమోదీ విభజన రాజకీయాలు దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ దృష్టిలో జీడీపీ అంటే స్థూల ఆర్థిక వృద్ధి కాదని, స్థూల విభజన రాజకీయాలని రాహుల్ ఎద్దేవా చేశారు. దేశంలో బ్యాంకుల పరిపతి దారణంగా పడిపోయిందని శనివారం తన ట్విట్టర్‌లో విమర్శించారు.

01/07/2018 - 02:39

న్యూఢిల్లీ, జనవరి 6: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందిందని శనివారంనాడు కాంగ్రెస్ దుమ్మెతిపోసింది. దేశంలోని పోలీసులకే రక్షణ కల్పించలేని దుస్థిలో కేంద్రం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ విమర్శించారు. జమ్మూకాశ్మీర్‌లో ఐఈడీ పేలుళ్లకు నలుగురు పోలీసుల మృతి చెందిన విషయాన్ని కాంగ్రెస్ ఈ సందర్భంగా ప్రస్తావించింది.

01/07/2018 - 02:38

న్యూఢిల్లీ, జనవరి 6: బొగ్గు గనుల కేటాయింపుకుంభకోణం కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌లో 383 ఎకరాల భూమిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. మనీలాండరింగ్ కింద 4.53 కోట్ల రూపాయల విలువైన భూమిని అటాచ్ చేసినట్టు శనివారం ఈడీ ప్రకటించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్‌లో ఈ అటాచ్‌మెంట్ చేసినట్టు తెలిపారు.

01/07/2018 - 02:36

అహ్మదాబాద్, జనవరి 6: ముంబయి సమీపంలోని ముంబ్రా కళాశాల విద్యార్థిని ఇషత్ జహన్ ఎన్‌కౌంటర్‌లో కింది కోర్టు నుంచి సమన్లు జారీ అయిన ఇద్దరు ఐబీ అధికారుల కేసుకు సంబంధించిన తీర్పును ప్రత్యేక సీబీఐ కోర్టు రిజర్వులో పెట్టింది. 2004 జూన్‌లో ముంబ్రాకు చెందిన కళాశాల విద్యార్థిని ఇషత్ జహన్ సహా మరో ముగ్గురు జావేద్ షేక్ అలియాస్ ప్రనీష్, అమ్జాద్ అలీ రానా, జీషాన్ జోహార్‌లు ఎన్‌కౌంటర్‌కు గురైన విషయం తెలిసిందే.

01/07/2018 - 02:35

ఇండోర్, జనవరి 6: మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌కు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందిన సంఘటనకు సంబంధించి ఆ బస్సు నడిపిన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ ప్రమాదంలో డ్రైవర్ కూడా మృతి చెందిన విషయం తెలిసిందే.

01/07/2018 - 01:42

న్యూఢిల్లీ, జనవరి 6: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభా హక్కుల నోటీసు జారీ చేశారు. లోక్‌సభ సభ్యుడైన రాహుల్ గాంధీపై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాశారు. రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేరును వక్రీకరిస్తూ ట్వీట్ చేసినందుకు రాహుల్‌కు నోటీసు జారీ అయ్యంది.

Pages