S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/13/2017 - 07:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఇప్పటి వరకూ పక్షానికో సారి మారుతూ వచ్చిన పెట్రో, డీజిల్ రేట్లు మే నెల నుంచి రోజువారీగా మారబోతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు రేట్ల ప్రకారం ప్రతి రోజూ పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పులు ఉండబోతున్నాయి.

04/13/2017 - 07:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశ వ్యాప్తంగా నిర్మాణ రంగంలోని కూలీల సంక్షేమానికి ఉద్దేశించిన వేలాది కోట్ల రూపాయలు ‘దారిమళ్లడం’పై సుప్రీం కోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇందుకోసం కేటాయించిన 27వేల కోట్ల రూపాయల వినియోగమే జరుగలేదని, ఇందులో 5వేల కోట్ల ఎందుకు ఖర్చయ్యాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందని తెలిపింది. ఇంత భారీ మొత్తాన్ని ఎందుకు ఎలా వినియోగించారో నిగ్గుదేల్చాలంటూ కాగ్‌ను ఆదేశించింది.

04/13/2017 - 07:17

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: విశాఖపట్నంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపిఈ)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పెట్రో వర్శిటీపై నిర్ణయం తీసుకుంది. విశాఖలో రూ.655.46 కోట్ల పెట్టుబడి వ్యయంతో పెట్రోలియం, ఇంధన యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది.

04/12/2017 - 04:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11:హిమాలయ శిఖరాన్ని అధిరోహించిన లంబాడా బాలిక మాలావత్ పూర్ణను ‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని ఎంపీ సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడుతూ పూర్ణ, మరో బాలుడు ఆనంద్ కుమార్ హిమాలయ శిఖరాన్ని అధిరోహించి తెలంగాణతోపాటు దేశానికి మంచి పేరు తెచ్చారన్నారు.

04/12/2017 - 04:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని పార్లమెంట్ ఉభయ సభల్లో అన్ని పార్టీలు ముక్తకంఠంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. జాదవ్‌పై గూఢచారిగా ముద్రవేసిన పాకిస్తాన్ సైనిక కోర్టు ఆయనకు మరణ దండన విధించిన నేపథ్యంలో ఈ అంశంపై లోక్‌సభ, రాజ్యసభలో మంగళవారం విస్తృత చర్చ జరిగింది.

04/12/2017 - 04:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణపై పాక్ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించిన కులభూషణ్ జాదవ్ ఇప్పటికే చనిపోయి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిజెపి పార్లమెంటు సభ్యుడు, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి ఆర్‌కె సింగ్ అంటున్నారు. ‘పాకిస్తాన్ జాదవ్‌ను చిత్రహింసలకు గురి చేసి చంపేసి ఉండవచ్చు.

04/12/2017 - 04:17

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ప్రపంచంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేయాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. శాంతిని నెలకొల్పడానికి తక్షణం ఓ సమగ్ర కార్యాచరణ ద్వారా ముందుకెళ్లాలని మంగళవారం ఆయన చెప్పారు.

04/12/2017 - 04:15

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: బడ్జెట్ సమావేశం అధికార పార్టీకి ఒక విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అంటూ, బిజెపి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతంగా రాణించిందని, పార్లమెంటులో అనేక బిల్లులు ఆమోదం పొందేలా చూడగలిగిందని అన్నారు.

04/12/2017 - 04:13

విశాఖపట్నం, ఏప్రిల్ 11: ప్రపంచ దేశాల అభివృద్ధికి ఉగ్రవాదం అవరోధంగా నిలిచిందని, దాన్ని అంతమొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క దేశంపైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్పెషల్ ఇన్వాయిస్ ఆన్ మిడిల్-ఈస్ట్ అన్న అంశంపై బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా (బ్రిక్స్) దేశాల ప్రతినిధుల సమావేశం విశాఖలో మంగళవారం జరిగింది.

04/12/2017 - 04:10

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: భారత దేశంలో 2015తో పోలిస్తే 2016లో మరణ శిక్షలు 86 శాతం పెరిగాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది. మరణ శిక్షలు, అమలుపై అంతర్జాతీయ నివేదిక ప్రకారం 2015లో కోర్టులు 76 మరణ శిక్షలు విధించగా, 2016లో ఈ సంఖ్య 136కు పెరిగింది. మరణ శిక్షలు విధించిన వాటిలో ప్రధానంగా హత్యలకు సంబంధించిన కేసులున్నాయి.

Pages