S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/21/2016 - 01:46

పుఖర్యాన్, నవంబర్ 20: పాట్నా లో సోమవారం జరగబోయే తన స్నేహితుడి పెళ్లికోసం ప్రమాదం జరిగిన ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన వ్యాపారవేత్త అరుణ్‌శర్మ కుటుంబం పాలిట ఈ ప్రయాణం ఓ పీడకలగా మిగిలిపోయింది. ఈ ప్రమాదంలో శర్మ, ఆయన భార్య, 11 ఏళ్ల కుమారుడు త్రియాంశ్ గాయాల పాలు కాగా, తొమ్మిదేళ్ల మరో కుమారుడి జాడ ఇంకా తెలియరాలేదు.

11/21/2016 - 01:54

ఇండోర్, నవంబర్ 20: ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు సమీపంలో ఘోర ప్రమాదానికి గురయిన ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కిన సుమారు 200 మంది ప్రయాణికుల బంధువులు తమ వారి యోగక్షేమాలు తెలియక ఆందోళనతో స్థానిక రైల్వే స్టేషన్‌కు చేరుకుని తమ బంధువుల యోగక్షేమాల గురించి ఆదుర్దాగా అడగడం కనిపించింది. ‘ఇప్పటివరకు దాదాపు 200 మంది ప్రయాణికుల గురించి ఎంక్వయిరీలు మాకు వచ్చాయి.

11/21/2016 - 00:35

సూరజ్‌కుంద్/ఆగ్రా, నవంబర్ 20: రైలు ప్రయాణాలను సురక్షితం చేసేందుకు ప్రమాదాలకు తావులేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైల్వేలకు విజ్ఞప్తిచేశారు. ఆదివారం ఆయన ఢిల్లీ శివార్లలోని సూరజ్‌కుంద్‌లో రైల్వేల అభివృద్ధి శిబిరంలో ప్రసంగిస్తూ, ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ వద్ద పట్టాలు తప్పి 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.

11/21/2016 - 00:33

ఆగ్రా, నవంబర్ 20: అవినీతి కార్యకలాపాలతో కోట్లకు కోట్లు సంపాదించిన వారికి తీవ్ర విఘాతం కలిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తనపై ధ్వజమెత్తుతున్న పార్టీల ఆరోపణలను తిప్పికొట్టారు.

11/21/2016 - 00:31

చండీగఢ్, నవంబర్ 20: ‘క్లీన్ ఇండియా’ (స్వచ్ఛ భారత్), ‘డిజిటల్ ఇండియా’లాంటి వినూత్న పథకాలను విజయవంతంగా అమలు చేసినట్లయితే భారతదేశం ప్రపంచంలోనే ఆధునిక ఆర్థిక శక్తిగా తయారవుతుందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. భారతదేశం రెండో హరితవిప్లవం చేరువలో ఉన్నందున, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడాన్ని ఇజ్రాయెల్‌ను చూసి నేర్చుకోవాలని రాష్టప్రతి అన్నారు.

11/21/2016 - 00:29

న్యూఢిల్లీ, నవంబర్ 20: మనిషికి, దేవుడికి మధ్య ఉన్న సంబంధం చాలా వ్యక్తిగతమైనదని, ఇతరులెవరూ ఈ అంశంలో జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ పేర్కొన్నారు. సమాజంలో శాంతికి సహనం ఎంతయినా అవసరమని ఆయన నొక్కి చెప్పారు. రాజకీయ సైద్ధాంతిక విభేదాలకన్నా మత యుద్ధాలలోనే ఎక్కువమంది ప్రజలు చనిపోయారని ఆయన అన్నారు.

11/21/2016 - 01:34

న్యూఢిల్లీ, నవంబర్ 20: పెద్దనోట్లను రద్దు చేయటం వల్ల తమ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింటోందని వివిధ రాష్ట్రాలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విన్నవించాయి. జిఎస్‌టి పన్ను పరిధికి సంబంధించి కేంద్ర రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగించేందుకు వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నోట్ల రద్దు ప్రధాన అంశంగా మారింది.

11/21/2016 - 00:26

చండీగఢ్, నవంబర్ 20: పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు అనే వరదలోనుంచి బయటపడటానికి అవి ఎలుకలు, పిల్లులు, పాముల వలె చెట్లు ఎక్కుతున్నాయని విమర్శించారు.

11/21/2016 - 00:24

లక్నో, నవంబర్ 20: నగర మేయర్లు, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల చైర్‌పర్సన్ల ఆర్థిక, పాలనాపరమైన అధికారాలను కుదించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులకు ఆమోదం తెలపడానికి నిరాకరించిన అనంతరం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఆర్డినెన్స్‌ను ఆ రాష్ట్ర గవర్నర్ రామ్‌నాయక్ ఆదివారం రాష్టప్రతికి నివేదించారు.

11/21/2016 - 00:23

ముంబయి, నవంబర్ 20: తమ బ్యాంకులో పేరుకుపోయిన దీర్ఘకాలిక అప్పులను ‘రైట్-ఆఫ్’ చేస్తున్నట్లు ఇటీవల భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బిఐ) ప్రకటించడంతో, తన అప్పును కూడా మాఫీ చేయాలని ఓ సపాయి ఉద్యోగి ఎస్‌బిఐకి లేఖ రాశాడు. మహారాష్టల్రోని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌లో భౌరవ్ సోనావానె సఫాయి కార్మికుడుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు ఎస్‌బిఐలో 1.5 లక్షల అప్పుంది.

Pages