S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/09/2016 - 02:36

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఎన్నికలకు ముందు ఎలక్ట్రానిక్ మీడియాపై ఆంక్షలు విధిస్తున్నట్టుగానే పోలింగ్ తేదీకి 48 గంటల ముందు నుంచి వార్తాపత్రికల్లో రాజకీయ వాణిజ్య ప్రకటనలను నిషేధించేందుకు ఎన్నికల చట్టాన్ని సవరించాలని ఎలక్షన్ కమిషన్ (ఇసి) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

08/09/2016 - 02:34

ఇంఫాల్, ఆగస్టు 8: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని గా పదహారేళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల మంగళవారం తన దీక్షను విరమించనున్నారు. 44 ఏళ్ల హక్కుల కార్యకర్తఅయిన షర్మిలను 2000 సంవత్సరం నుంచి జైలుగా మార్చిన ఆసుపత్రిలోనే ఉంచుతున్నారు. ఆమె తన దీక్షను స్థానిక న్యాయస్థానంలో విరమిస్తారు. ‘షర్మిలను ఉదయం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు.

,
08/09/2016 - 03:58

మహబూబ్‌నగర్, ఆగస్టు 8: మాజీ మావోయిస్టు నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి పోలీస్ వ్యవస్థకు సవాల్‌గా మారిన నరహంతకుడు నరుూం ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. గ్యాంగ్‌స్టర్‌గా సెటిల్‌మెంట్లు, భూదందాలకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిని కిరాతకంగా మట్టుబెట్టి కోట్ల రూపాయల దందా నడిపస్తున్న నరుూం (50) సోమవారం ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

08/08/2016 - 18:20

దిల్లీ: బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఇటీవలే బయటకు వచ్చిన ఓబీసీ నేత స్వామి ప్రసాద్‌ మౌర్య నేడు భాజపాలో చేరారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

08/08/2016 - 18:06

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లో పాక్ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వద్ద భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం రావడంతో వాస్తవాధీన రేఖ వద్దకు భద్రతాదళాలు చేరుకోగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సైనికులు కూడా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు బిఎస్‌ఎఫ్ జవాన్లు, ఓ ఉగ్రవాది మరణించినట్టు అధికారులు ప్రకటించారు.

08/08/2016 - 18:06

గాంధీనగర్: గుజరాత్ మంత్రివర్గంలో సోమవారం ఉదయం 23 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ ఆదివారం ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన సిఎం ఆనందీబెన్ మంత్రివర్గంలో 9 మందికి ఉద్వాసన పలికారు. కొత్తగా 9 మందికి అవకాశం కల్పించారు. మంత్రుల్లో 8 మంది పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం.

08/08/2016 - 18:01

చండీగఢ్: గో రక్ష దళ్ చీఫ్ సతీష్ కుమార్పై పంజాబ్ పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గోవులను కబేళాకు తరలిస్తున్నారన్న నేపథ్యంలో యువకులపై దాడికి పాల్పడిన ఘటనలో సతీష్ కుమార్ సహా రాజ్పుర, అన్నూ, గుర్ప్రీత్ అలియాస్ హ్యాపీలపై ఐపీసీ సెక్షన్లు 382, 384, 342, 341, 323, 148, 149 కింద కేసు నమోదు చేసినట్లు, అయితే ఇప్పటివరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు పేర్కొన్నారు.

08/08/2016 - 17:54

జైపూర్: రాజస్థాన్లో స్కూల్ బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 50 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. ఆచార్య విద్యాసాగర్ పాఠశాలకు చెందిన బస్సు సోమవారం ఓ చిన్న వంతెనను దాటుతుండగా.. అదుపుతప్పి నదిలో పడిపోయింది. నీటిలో బస్సు మునిగిపోతుండటం గమనించిన సమీపంలోని ప్రజలు చిన్నారులను కాపాడారు.

08/08/2016 - 17:19

ముంబై : ముంబైలో వివాదస్పద ముస్లిం మత ప్రచారకుడు జాకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్‌పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం వినియోగించాలని కేంద్ర హోంశాఖకు న్యాయశాఖ సిఫార్సు చేసింది. ఫౌండేషన్‌ నిషేధంపై కేంద్ర న్యాయశాఖ చర్యలు చేపట్టింది. 2005, 2012లో దీనికి సంబంధించి ఆయనపై నమోదైన కేసులను ఆధారంగా పేర్కొంది. ఈ బ్యాన్ అమలులోకి వస్తే ఐదేళ్ళ పాటు ఉంటుంది.

08/08/2016 - 15:59

దిల్లీ: బులియన్‌ మార్కెట్లో సోమవారం బంగారం ధర రూ. 30 తగ్గింది. దీంతో పది గ్రాముల పసిడి ధర రూ. 30,900గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పడిపోయింది. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం 1,331.59 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. జులై 29 నుంచి సింగపూర్‌లో ఇదే కనిష్ఠ ధర. వెండి ధర కూడా నేడు రూ. 50 తగ్గింది. దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 46,250గా ఉంది.

Pages