S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/10/2016 - 06:48

భభ్రా (మధ్యప్రదేశ్), ఆగస్టు 9: నెల రోజులకు పైగా అల్లర్లతో అట్టుడుకుతున్న కాశ్మీర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా పెదవి విప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చూపించిన ఇన్సానియత్ (మానవత్వం), జమురియత్ (ప్రజాస్వామ్యం), కశ్మీరీయత్ (కాశ్మీర్ ప్రజల మనోభావాలు) ఆధారంగా చర్చలు జరపడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

08/10/2016 - 06:43

న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, సమైక్యతకోసం పునరంకితం కావాలని పార్లమెంటు ప్రకటించింది. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా దేశంకోసం అశువులుబాసిన సమరయోధులకు మంగళవారం పార్లమెంటు ఘన నివాళులర్పించింది. జాతిపిత మహాత్మాగాంధీ, స్వాతంత్య్ర సమరయోధులకు సభ ఘనంగా అంజలి ఘటించింది. దేశ చరిత్రలో ఈ రోజు చిరస్మరణీయమని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ స్పష్టం చేశారు.

08/10/2016 - 06:43

న్యూఢిల్లీ, ఆగస్టు 9: రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందంటూ రాజ్యసభను తప్పుదోవ పట్టించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీపై చర్య తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఎంపీలు కెవిపి రామచందర్‌రావు, జైరాం రమేష్, సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి సభా హక్కుల నోటీసు ఇచ్చారు.

08/10/2016 - 06:45

ఇంఫాల్, ఆగస్టు 9: సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఆఫ్‌స్పా) రద్దు చేయాలంటూ పదహారేళ్ల పాటు అవిశ్రాంతంగా నిరాహార దీక్ష చేసిన మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిళ మంగళవారం తన దీక్షను విరమించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ఇరోమ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంఫాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జైలుగా మార్చిన ఓ గదిలో అరచేతిలోని తేనెను స్వీకరించి దీక్ష విరమించారు.

08/10/2016 - 06:37

ముంబయి, ఆగస్టు 9: క్విట్ ఇండియా ఉద్యమం వ్రజోత్సవం (75వ సంవత్సరం) ఉత్సవాలను పురస్కరించుకుని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పలు సామాజిక రుగ్మతలపై పోరాడడానికి అలాగే సురాజ్ (సుపరిపాలన)ను తీసుకు రావడానికి ‘క్విట్‌ఇండియా ఉద్యమం-2’ను ప్రారంభించింది.

08/10/2016 - 06:33

న్యూఢిల్లీ, ఆగస్టు 9: విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఢిల్లీలో వినూత్న నిరసనకు దిగారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో తప్పెటగుళ్లు కళాకారుడి వేషధారణలో నిరసన తెలిపారు. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలు నెరవేర్చాలని పాటద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఏపికి కేంద్రం అన్యాయం చేయొద్దని కోరారు.

08/10/2016 - 07:48

ఇటానగర్, ఆగస్టు 9: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖోపుల్ మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే ఉదయం 7.30 గంటల సమయంలో ఉరివేసుకుని చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నలభై ఏడేళ్ల కలిఖోపుల్ తన బెడ్రూమ్‌లో సీలింగ్‌ఫాన్‌కు ఉరివేసుకున్నట్లు ఆయన భార్యల్లో ఒకరు గుర్తించి పోలీసులకు తెలియజేశారు.

08/10/2016 - 05:01

న్యూఢిల్లీ, ఆగస్టు 9:గోసంరక్షణ పేరుతో దాడులు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. బూటకపు గో సంరక్షకులను శిక్షించాలని రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది.

08/10/2016 - 04:39

బళ్ళారి, ఆగస్టు 9: తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో తుంగనది పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయం నిండడంతో దిగువ తుంగభద్ర జలాశయానికి నీరు విడుదల చేశారు. మంగళవారం 44,713 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో జలాశయం నీటిమట్టం 43.983 టిఎంసిలకు చేరుకుంది.
జూరాలలో తొమ్మిది గేట్లు ఎత్తివేత

08/10/2016 - 04:38

న్యూఢిల్లీ,ఆగస్టు 9: జిఎస్‌టి కారణంగా అమ్మకం పన్ను కేంద్రం పరిధిలోకి పోతే ఏపి అభివృద్ధికి ప్రత్యేక హోదా ఇవ్వకతప్పదని వైకాపా అధ్యక్షుడు,ప్రతిపక్షం నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ కార్యదర్శి డి.రాజా, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను కలిసి ప్రత్యేక హోదా, రక్షణ శాఖ విమానం ఏఎన్.32 గల్లంతు తదితర అంశాల గురించి చర్చించారు.

Pages