S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/09/2016 - 03:36

చెన్నై, ఆగస్టు 8: తెలుగు భాషకు ప్రాచీన హోదాపై తమిళులు చేసిన కుట్ర విఫలమైంది. 2008లో తెలుగుభాషతో పాటు మలయాళం, కన్నడ భాషలకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ ఆర్.గాంధీ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు సోమవారం కొట్టివేసింది. వివిధ భాషలకు ప్రాచీన హోదా ఇచ్చే విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయంలో తాము జోక్యం చేసుకునేది లేదని తేల్చిచెప్పింది.

08/09/2016 - 03:32

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఆంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రకటించారు. అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో వైకాపా సభ్యులు సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు చేసిన ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్లకు బదులిచ్చారు. ఏపీకి అందించాల్సిన సాయంపై సిఎంతో జరుపుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నాయన్నారు.

08/09/2016 - 03:29

న్యూఢిల్లీ, ఆగస్టు 8:ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని అడిగే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. హోదా విషయంలో చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదని, ఈ విషయంపై ఆయన ఒక్కసారి కూడా ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడలేదని ఆయన ధ్వజమెత్తారు.

08/09/2016 - 03:24

న్యూఢిల్లీ, ఆగస్టు 8: పన్నుల సంస్కరణల భారత దేశం చారిత్రక శకంలోకి అడుగు పెట్టింది. ఎన్డీయే సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జిఎస్‌టి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇటీవల రాజ్యసభ కొన్ని సవరణలతో చేపట్టిన వస్తు,సేవల పన్ను (జిఎస్‌టి) 122 రాజ్యాంగ సవరణ బిల్లును సుదీర్ఘ చర్చ అనంతరం సోమవారం లోక్‌సభ ఆమోదించింది. దీనితో పార్లమెంట్ ఆమోద ప్రక్రియ పూర్తయింది.

,
08/09/2016 - 03:12

హైదరాబాద్, ఆగస్టు 8: తమిళ భాషకు కాకుండా వేరే ఏ ఇతర భాషలకూ ప్రాచీన హోదా ఇవ్వరాదు. తమిళభాషే అత్యంత ప్రాచీనమైంది. దీన్ని మించిన భాష మరొకటి దేశంలో లేదు. ఉండదు. తమిళంతో సరిసమానంగా వేరే భాషలకు ప్రాచీన హోదా కట్టబెడితే, తమిళానికి ఉన్న ప్రాధాన్యం తగ్గిపోదూ.. అందుకే ఏ ఇతర భాషకూ ఎలాంటి హోదా ఇవ్వటానికి వీల్లేదన్న ఓ సగటు తమిళ దురభిమానికి మద్రాసు హైకోర్టు సోమవారం గట్టిగా బుద్ధి చెప్పింది.

08/09/2016 - 02:50

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఖైదీల విడుదల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో ఖైదీలను విడుదల చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ పూర్తిచేసింది. ప్రస్తుతం ఆ జీవోలు కాలం చెల్లినవిగా ధర్మాసనం అభిప్రాయపడింది.

08/09/2016 - 02:49

న్యూఢిల్లీ, ఆగస్టు 8: ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ)లో పనిచేస్తున్న అధికారులందరి వేతనాలను సమాచార హక్కు (ఆర్‌టిఐ) చట్టంలోని సెక్షన్ 4 కింద పిఎంఒ తనంత తానుగా బహిర్గతం చేసింది. పిఎంఒ వెల్లడించిన ఈ వివరాల ప్రకారం సీనియర్ ఐఎఎస్ అధికారి భాస్కర్ ఖుల్బే అందరికన్నా ఎక్కువగా నెలకు రూ. 2.01 లక్షల వేతనం పొందుతున్నారు.

08/09/2016 - 02:44

న్యూఢిల్లీ, ఆగస్టు 8: వైద్య విద్యకు సంబందించి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(నీట్)కు రాష్టప్రతి ఆమోద ముద్ర వేశారు. ఎంబిబిఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షను ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన రెండు బిల్లులకు ఇటీవలే పార్లమెంటు ఆమోదించింది.

08/09/2016 - 02:41

భోపాల్, ఆగస్టు 8: క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ‘ఆజాదీ-70, యాద్ కరో కుర్బానీ’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. స్వాతంత్రోద్యమ విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ స్వస్థలమైన మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లా భభ్రాలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

08/09/2016 - 02:37

న్యూఢిల్లీ, ఆగస్టు 8: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భుజం గాయం నుంచి వేగవంతంగా కోలుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతూ సాధారణ స్థితికి చేరుకుంటోందని సర్ గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు సోమవారం వెల్లడించారు.

Pages