S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/11/2016 - 07:12

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలా? లేక ప్రత్యేక ఆర్థిక సాయం చేయాలా అన్న దానిపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఏపికి ఇవ్వాల్సిన ప్రత్యేక ఆర్థిక సహాయ ప్యాకేజీ సిద్ధమవుతోందంటూ పార్లమెంట్ ఆవరణలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం విలేఖరులకు నర్మగర్భంగా చెప్పారు.

08/11/2016 - 06:09

న్యూఢిల్లీ, ఆగస్టు 10:ప్రపంచంలో ఏ శక్తీ భారత్ నుంచి కాశ్మీర్‌ను విడదీయలేదని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. కాశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అల్లర్లు, హింసాకాండకు పాకిస్తానే కారణమని తెగేసి చెప్పారు. కాశ్మీర్ పరిస్థితిపై బుధవారం రాజ్యసభలో విస్తృతంగా చర్చ జరిగింది.

08/11/2016 - 06:06

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఎస్సీ కులాల వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వ సానుకూలంగా ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీస్ ఆధ్యర్యంలో ఎస్సీ వర్గీకరణ కోరుతూ చేపట్టిన నిరసన కార్యక్రమానికి కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ హాజరయ్యా రు.

08/10/2016 - 18:05

కేరళ : కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కారు ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి మరణించారు. మృతుడిని పోలీసులు పుతియకవు ప్రాంతానికి చెందిన శశిగా గుర్తించారు. కేరళలో కొచ్చికి వచ్చిన సింధియా కారులో చేర్తలకు వెళ్తుండగా కొచ్చి-అలప్పుజ హైవేపై పుతికయకవు వద్ద సింధియా కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అయితే కారు నడిపింది సింధియా డ్రైవర్‌.

08/10/2016 - 17:52

దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం, భారత్ పర్వ్ సందర్భంగా దేశంలోని ప్రముఖ చారిత్రక కట్టడాల వద్ద ఈ నెల 12 నుంచి వారం రోజుల పాటు సెల్ఫీలపై నిషేధం విధించినట్లు కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించింది. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలని కోరింది.

08/10/2016 - 14:31

ఇంఫాల్‌: ‘ నేను ఓ దేవతలా ఉండాలని ప్రజలు అనుకుంటున్నారు... ఇలాగే పోరాడి అమరత్వం పొందాలని కోరుకుంటున్నారు... కానీ- నేను సాధారణ మనిషిలా ఉండాలని అనుకుంటున్నా’నని మణిపూర్‌కు చెందిన ప్రముఖ హక్కుల నేత ఇరోం చాను షర్మిల అన్నారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ కు వ్యతిరేకంగా షర్మిల 16ఏళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షను నిన్న ముగించిన సంగతి తెలిసిందే.

08/10/2016 - 14:23

ఇంఫాల్‌: మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో బుధవారం వరుస పేలుళ్లు సంభవించాయి. మణిపూర్‌ యూనివర్సిటీ గేట్‌ వద్ద బాంబు పేలింది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడినదీ లేనిదీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉదయం 9 గంటల ప్రాతంలో ఇంఫాల్‌ ఈస్ట్‌లోని బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌ సమీపంలో ఏడేళ్ల బాలిక గాయపడింది. పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ జవాన్లుభద్రతను పెంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

08/10/2016 - 13:45

దిల్లీ: దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద బుధవారం ఎమ్మార్పీఎస్‌ ధర్నాకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ హాజరై మద్దతు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్‌ దిల్లీలో చేపట్టిన ధర్నా 23వ రోజుకు చేరింది.

08/10/2016 - 13:42

రిషికేశ్‌ : విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం రిషికేశ్‌లో వైకాపా అధ్యక్షుడు జగన్‌ చాతుర్మాస దీక్ష హోమంలో పాల్గొన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న జగన్‌ ఈరోజు ఉదయం డెహ్రాడూన్‌ నుంచి రిషికేశ్‌ చేరుకున్నారు.

08/10/2016 - 12:04

ముంబయి: ఇవాళ ప్రారంభం నుంచి స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.73 పైసలు వద్ద కొనసాగుతోంది. 230 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 80పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

Pages