S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/08/2016 - 15:07

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా త్వరలోనే ఓ పరిష్కారానికి వస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో సోమవారం తెలిపారు. అంతకుముందు తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు సభలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని, విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేయాలని కోరారు.

08/08/2016 - 11:47

సికింద్రాబాద్‌: రాబోయే రైల్వే బడ్జెట్‌లో దక్షిణాదిపై దృష్టి సారించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు స్పష్టం చేశారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు. ఎంఎంటీఎస్‌ సేవలను శంషాబాద్‌ వరకు పొడిగించేందుకు, చర్లపల్లి, నాగులపల్లిలో గ్రీన్‌ఫీల్డ్‌ టెర్మినల్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

08/08/2016 - 11:44

చెన్నై: నిబంధనల ప్రకారమే ప్రాచీన హోదా కల్పించారని మద్రాసు హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ప్రాచీన హోదా పొందేందుకు తెలుగుకు అన్ని అర్హతలున్నాయని న్యాయస్థానం పేర్కొంది. తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ 2009లో మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

08/08/2016 - 11:41

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్ సీపీ ఎంపీలు సోమవారం ధర్నా చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్లమెంట్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.

08/08/2016 - 08:12

గాంధీనగర్, ఆగస్టు 7: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఇక్కడ అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఒపి కోహ్లీ వీరిచేత పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. వీరితోపాటుగా ఏడుగురు క్యాబినెట్ మంత్రులు, 16 మంది సహాయ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

08/08/2016 - 08:10

న్యూఢిల్లీ, ఆగస్టు 7: బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యం స్వామి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. గతంలో రాజన్‌పై తాను విమర్శలు చేయడాన్ని ప్రధాని నరేద్ర మోదీ తప్పుపట్టిన తర్వాత స్వామి నెల రోజులుగా రాజన్‌పై కానీ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై కానీ ఎలాంటి విమర్శలూ చేయలేదు.

08/08/2016 - 08:10

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేసిన తర్వాత రిటైరయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పింఛను 9 వేల రూపాయలు లభిస్తుంది. ఈ పింఛను ఇప్పుడు 3,500 రూపాయలుగా ఉంది. అంటే 157 శాతానికి పైగా పెరుగుతుంది. పెన్షనర్లకు సంబంధించి వేతన సంఘం చేసిన సిఫార్సులను ఆమోదించినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ఫిర్యాదులు, పింఛను వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది.

08/08/2016 - 08:08

రాయపూర్, ఆగస్టు 7: ‘మా నాన్నను మావోయిస్టులు చంపేశారు. నేను పెద్దయ్యాక కలెక్టరునవుతా. నక్సలైట్ల ఆలోచనా దోరణిని మారుస్తా’ అంటూ ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కేంద్ర మంత్రి జావడేకర్ ముందే స్పష్టం చేశాడు. నక్సల్స్ పీడిత ప్రాంతాల్లో ఉన్న ‘పయాస్’ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో కేంద్ర జనశక్తి వనరుల మంత్రి జావడేకర్ ఆదివారం ముఖాముఖి జరిపారు.

08/08/2016 - 08:08

న్యూఢిల్లీ, ఆగష్టు 7: సామాన్యుల సమస్యలు, జాతివివక్షపై యువ కవులు రాసిన కవితలను ఢిల్లీలోని ఆంధ్రభవన్‌లో ఆధునిక తెలుగు కవిత్వ సదస్సులో వినిపించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కె.శివారెడ్డి, ఎన్.వేణుగోపాల్, విమల మార్తల, అరుణ గోగుల మండ, అరణ్య కృష్ణ, పలమనేర్ బాలాజీ, కే.కే.కే.వర్మలలోసహా యువకవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

08/08/2016 - 08:07

న్యూఢిల్లీ, ఆగస్టు 7: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సంస్కరణలపై లోధా కమిటీ సిఫార్సులను తప్పక అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తప్పుబడుతూ ఆ సంస్కరణలు రాజ్యాంగ విర్ధుమైనవని, చట్ట వ్యతిరేకమైనవని అన్నారు.

Pages