S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/22/2019 - 16:47

వారణాశి: ప్రభుత్వం అందించే వివిధ సేవలను నేరుగా లబ్ధిదారులకు చేరేందుకు సరళతరం చేశామని ప్రధాని మోదీ అన్నారు. ఆయన వారణాశిలో ఏర్పాటుచేసిన ‘ప్రవాస భారతీయ దివాస్(పిబిడి) 2019’లో ప్రసంగించారు. గతంలో భారతదేశం చేయలేదు అని భావించనవి కూడా ఈ నాలుగన్నరేళ్లలో సాధించగలిగామని అన్నారు.

01/22/2019 - 13:08

బెంగళూరు: నడిచే దేవుడు శివకుమార స్వామీజీ పార్థీవదేహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. లింగాయత్‌ల ఆరాధ్య దైవంగా పిలిచే శివస్వామిజీని సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ భక్తులు తరలివెళ్లారు. మఠంలోని వజ్రమహోత్సవ భవనానికి సమీపంలోని మ్యూజియం వద్ద పార్థీవదేహాన్ని ఉంచారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు స్వామిని మహాసమాధి చేయనున్నారు.

01/22/2019 - 12:21

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నాం నుంచి అకాల వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వడగల్లు సైతం పడ్డాయి. నల్లటి మేఘాలు ఆవరించటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు 13 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మంగళవారం ఉదయం కూడా వర్షం పడటంతో పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. భారీ వర్షం కారణంగా నజఫ్‌గౌడ్‌లో గోడకూలి ఇద్దరు మృతిచెందారు.

01/22/2019 - 03:43

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ప్రతిపక్షంలో నెలకొన్న గందరగోళం మధ్య జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఎద్దేవా చేశారు. అరుణ్ జైట్లీ సోమవారం రాసిన ఒక బ్లాగ్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత శనివారం కోల్‌కత్తాలో 23 ప్రతిపక్ష పార్టీల నాయకులతో కలిసి నిర్వహించిన బహిరంగ సభపై విమర్శలు గుప్పించారు.

01/22/2019 - 03:22

అహ్మదాబాద్, జనవరి 21: ప్రతి పక్షాల మహాకూటమి ఐక్యతపై ప్రధాని నరేంద్రమోదీకి భయం పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ అన్నారు. కోల్‌కతాలో ఇటీవల జరిగిన ర్యాలీపై ఆయన చేసిన విమర్శలు, భావోద్వేగాన్ని బట్టి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు.

01/22/2019 - 02:50

పారిశుద్ధ్యం, స్వచ్ఛత గురించి రాజకీయ పార్టీలు ఎంతగా రాత్రింబవళ్లు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చినా ఎంత మేరకు అవి వాటిని పాటిస్తాయన్నది మేడుపండు చందమే. సాక్షాత్తూ దేశ రాజధాని నగరంలోని రామ్‌లీలా మైదానంలో కనిపిస్తున్న ఈ దృశ్యం చూస్తే స్వచ్ఛతా ఏదీ నీ చిరునామా అన్న సందేహామే కలుగుతోంది. బీజేపీ విజయ సంకల్ప ర్యాలీ అనంతరం రామ్‌లీలా మైదానం ఇలా చెత్తా చెదారంతో నిండిపోయింది

01/22/2019 - 03:45

వారణాసిలో జరుగుతున్న కుంభమేళాలో సోమవారం భక్తుల ప్రవాహమే సాగింది. పుష్య పూర్ణిమ సందర్భంగా పవిత్ర గంగానదిలో స్నాన మాచరించేందుకు దాదాపు కోటిమందికి పైగా తరలివచ్చారు.

01/22/2019 - 02:46

అలహాబాద్, జనవరి 21: పవిత్ర గంగానది భక్తుల తాకిడితో సోమవారం కిటకిటలాడింది. గజగజలాడించే చలిలోనూ కోటి మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పౌష పూర్ణిమ కావడంతో అర్థకుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆదివారం రాత్రి నుంచే భక్తుల రాకపోకలు మొదలయ్యాయి. త్రివేణి సంగమం ప్రాంతంలో ఇసుకవేస్తే రాలనంత జనం కనిపించారు.

01/22/2019 - 02:42

బెంగళూరు, జనవరి 21: ‘నడిచే దేవుడు’గా అన్ని వర్గాల ప్రజలు భక్తి ప్రపత్తులతో కొలిచే శ్రీ సిద్ధగంగ మఠం స్వామిజీ శివకుమార స్వామి పరమపదించారు. గత రెండు వారాలు అనారోగ్యంతో బాధపడుతున్న 111 సంవత్సరాల ఈ స్వామి మరణించడంతో కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల సంతాపదినాలను ప్రకటించింది. కోట్లాది మంది కొలిచే శివకుమార స్వామి గౌరవార్థం మంగళవారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

01/22/2019 - 02:41

చిత్రం..చెన్నైలోని మురగన్ ఆలయంలో సోమవారం జరిగిన ఓ మత ప్రదర్శనలో చేతులో పిల్లాడ్ని పట్టుకొని
అగ్నిగుండంపై నడుస్తున్న ఓ హిందూ భక్తురాలు

Pages