S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/03/2018 - 13:34

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల విభజనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు నిచ్చింది. స్థానికత ఆధారంగా విభజన జరపాలని తెలంగాణ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారమే రోస్టర్‌ విధానంలో నియామకాలు చేపట్టాలని జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

10/03/2018 - 12:57

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.

10/03/2018 - 12:46

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ కోల్‌కతా మెడికల్ కళాశాల అండ్ ఆసుపత్రిలోని ఫార్మసీ విభాగంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదు. ప్రమాదంలో చిక్కుకున్న 250 మంది రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

10/03/2018 - 12:45

న్యూఢిల్లీ: తమ సమస్యల పరిష్కారం కోసం గత పది రోజులుగా పాదయాత్ర చేసుకుంటూ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న కిసాన్ క్రాంతి యాత్రను బుధవారం తెల్లవారు జామున ముగించారు. భారత్ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్ర ఉత్తరాఖండ్ నుంచి ప్రారంభమైంది. అయితే మంగళవారం వేలాది మంది రైతులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు.

10/03/2018 - 12:44

న్యూఢిల్లీ: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయ్ బుధవారంనాడు బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ గొగొయ్ అసోంలో 1954లో జన్మించారు. 1978లో బార్‌లో చేరారు. పలు హైకోర్టులకు జడ్జిగా పనిచేసిన ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా 2012లో పదోన్నతి పొందారు. జస్టిస్ గొగొయ్ చేత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు.

10/03/2018 - 12:42

న్యూఢిల్లీ: గీత వర్శిటీ వ్యవస్థాపకులు మూర్తి మృతి పట్ల ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని ఉప రాష్టప్రతి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

10/03/2018 - 06:30

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఐటి రంగంలో ఉద్యోగాల కల్పన పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం బూటకపు కంపెనీలకు భూకేటాయింపులు జరిపి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని బీ.జే.పీ రాజ్యసభ సభ్యుడు,ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మంగళవారం జీవీఎల్ నరసింహారావు బీ.జే.పీ కార్యలయంలో తెలుగుదేశం ప్రభుత్వంపై మరోసారి అవినీతి ఆరోపణలు చేశారు.

10/03/2018 - 03:59

న్యూఢిల్లీ: ఒకపక్క మనం దేశమంతా మహాత్ముని 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆయన చేసిన గొప్పతనాన్ని వేనోళ్ల కీర్తించుకుంటున్నాం. అయితే ఆయన పేరున ప్రకటించిన ‘గాంధీజీ శాంతి బహుమతి’ని గత నాలుగేళ్లుగా ఎవరికీ ఇవ్వడం లేదన్న విషయం మనం ప్రస్తావించుకోవాల్సిందే. ఆయన పేరున ఇచ్చే బహుమతిని నిలిపివేశారా? లేక దానికి సరైన వ్యక్తులే దొరకడం లేదా అన్న ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి.

10/03/2018 - 02:53

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన తెలంగాణ రాష్ట్రం దక్షిణాదిలో రెండవ స్థానంలో నిలిచి నాలుగు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ పురస్కారాలను కైవసం చేసుకుంది. కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వాశాఖ నేతృత్వంలో మంగళవారం సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ అవార్డులను కేంద్ర మంత్రి ఉమా భారతి అందజేశారు.

10/03/2018 - 01:40

వార్ధా(మహారాష్ట్ర), అక్టోబర్ 2: ప్రధాని నరేంద్రమోదీ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని, లౌకికవాదాన్ని బలహీనపరుస్తున్నారని, మహాత్మాగాంధీ అహింస, సత్యాగ్రహాన్ని స్పూర్తిగా తీసుకుని విచ్ఛిన్నరశక్తులపై రాజీలేని పోరాటం చేస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు.

Pages