S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/05/2018 - 01:29

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్‌కు తన అధికార నివాసంతో గురువారం రాత్రి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు అగ్రనేతలు ద్వైపాక్షిక సంబంధాలు, అభివృద్ధి, ప్రపంచ రాజకీయాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు రానున్న రోజుల్లో వ్యూహాత్మకంగా అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు.

10/05/2018 - 01:26

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: భారత కరెన్సీ రూపాయి గురువారం డాలర్‌తో మారకం విలువ అతి తక్కువగా 73.77 రూపాయలుగా నమోదు చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ‘ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు.. బ్రోకింగ్ న్యూస్’ అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, కరెంట్ ఖాతా లోటు, పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాల కారణంగా రూపాయి విలువ మరింత దిగజారి 73.77 రూపాయలకు చేరుకుంది.

10/05/2018 - 01:26

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: వాతావరణ మార్పుపై పారిస్ ఒప్పందాన్ని మార్చే ప్రసక్తిలేదని, ఈ విషయమై అమెరికా చేసిన వ్యాఖ్యల అర్థరహితమని ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం చీఫ్ ఎరిక్ సోల్హెమ్ చెప్పారు. ఈ ఒప్పందం లోపభూయిష్టమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు విచారకరమన్నారు. ఈ ఒప్పందం వల్ల భారత్, చైనాకు ప్రయోజనం చేకూరిందని చేసిన ప్రకటనలో నిజం లేదన్నారు.

10/05/2018 - 00:15

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: భగ్గున మండుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను అదుపులో పెట్టేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నడుము బిగించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను లీటరుకు రెండు రూపాయల యాభై పైసలు తగ్గించింది. ఈ తగ్గింపు వెంటనే అమలులోకి వస్తుంది.

10/04/2018 - 17:19

న్యూఢిల్లీ: రోజు రోజుకి రూపాయి పతనం చెందటంపై ఎందుకు స్పందించటం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ముడి చమురు ధరలు పెరిగి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని అన్నారు. దీనిపై ఎవ్వరూ స్పందించకపోవటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యధోరణికి అద్దంపడుతుందని అన్నారు.

10/04/2018 - 13:30

న్యూఢిల్లీ; రోహింగ్యాల తరలింపునకు సుప్రీం కోర్టు ఓకే చెప్పింది. వీరి తరలింపుపై వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ప్రభుత్వ నిర్ణయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది.

10/04/2018 - 13:29

న్యూఢిల్లీ: భారత కుబేరులలో మళ్లీ ప్రధమ స్థానం రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకే దక్కింది. 2018 సంవత్సరానికిగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో 3.49 లక్షల కోట్లతో ముఖేశ్ అగ్రస్థానంలో నిలిచారు. ఇక ద్వితీయ స్థానంలో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ 1.55 లక్షల కోట్లతోనూ, 1.35 లక్షల కోట్లతో లక్ష్మీ మిత్తల్ మూడవ స్థానంలో నిలిచారు.

10/04/2018 - 13:28

పాట్నా: బీహార్‌లోని ముజిఫర్ నగర్ వసతి గృహంలో బాలికలపై జరిగిన అఘాయిత్యాల కేసులో ఓ అస్తిపంజరం బయటపడింది. సీబీఐ ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తులో ఇది బయటపడింది. సికిందర్‌పూర్‌లోని స్మశానవాటికలో దీనిని గుర్తించారు. ప్రధాన నిందితుడు బజ్రేష్ ఠాకూర్ డ్రైవర్‌ను విచారించగా ఇది బయటపడింది. ఈ వసతి గృహంలో దాదాపు 40 మంది బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

10/04/2018 - 05:08

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు, 2019 లోకసభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఓడించేందుకు ప్రతిపక్షం ఏర్పాటు చేయాలనుకున్న మహా కూటమి కుప్పకూలింది. కాంగ్రెస్ అహంకార రాజకీయాల మూలంగా మహాకూటమి ఏర్పాటు సాధ్యం కావటం లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఆరోపించారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని మాయావతి ప్రకటించారు.

10/04/2018 - 04:37

భద్రాచలం టౌన్, అక్టోబర్ 3: చత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు చనిపోగా మరో మావోయిస్టు తీవ్ర గాయాలై బలగాలకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సుక్మా, దంతేవాడ రిజర్వ్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు బుధవారం మావోయిస్టుల ఆచూకీ కోసం కూంబింగ్ చేపట్టాయి.

Pages