S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/04/2018 - 02:21

లక్నో, అక్టోబర్ 3: అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రతిష్టాత్మక చాంపియన్స్ ఆఫ్‌ది ఎర్త్ అవార్డును అందుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత పర్యటనలో ఉన్న అమెరికా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటర్రెస్ న్యూఢిల్లీలో బుధవారం ప్రధాని మోదీకి ఈ అవార్డును అందజేశారు.

10/04/2018 - 02:19

న్యూఢిల్లీలో గురువారం కిసాన్ క్రాంతి పాదయాత్ర ముగిసిన తరువాత తమ తమ స్వస్థలాలకు బయల్దేరుతున్న రైతులు.
ఈమహా పాదయాత్ర సందర్భంగా రైతులు చేసిన డిమాండ్లలో ఏడింటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
కాగా తాత్కాలికంగానే యాత్రను విరమించబోమని, డిమాండ్ల సాధనకు పోరు కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు.

10/04/2018 - 02:17

చిత్రం..కొల్‌కతా మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో బుధవారం చెలరేగిన మంటల కారణంగా దట్టంగా అలుముకున్న పొగ.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమై రోగులను భవనం నుంచి బయటకు తరలించారు.
(ఇన్‌సెట్లో)
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి కాకపోవడంతో ఆవరణలోనే వేచి ఉన్న రోగులు.

10/04/2018 - 02:11

ముంబై, అక్టోబర్ 3: ‘సైడ్‌హీరో’తో వెబ్ వరల్డ్‌లో చేరిన తాజా దర్శకుడు రోహన్ సిప్పీ. ఆసక్తికరమైన కథల గురించి వ్యాఖ్యానించడానికి డిజిటల్ వేదిక నేడు వేగంగా అభివృద్ధి చెందుతోంది. చలన చిత్రాలు డిజిటల్ మాధ్యమంలోకి వెళుతున్నాయి. దాంతో అతి ఖరీదైనవిగా మారి ఈ పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. ‘మంచి కంటెంట్‌తో రూపుదిద్దుకున్న చలన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని నమోదు చేస్తున్నాయి.

10/04/2018 - 02:10

ముంబై, అక్టోబర్ 3: హాస్య చిత్రాలతో నటుడు వరుణ్‌శర్మ బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అలాంటి నటుడు ‘ఫ్రైడే’లో గోవిందతో నటించేటప్పుడు మాత్రం ఎంతో భయపడ్డానని చెప్పుకొచ్చాడు. ‘గోవిందతో నటించడం ఓ సవాల్ వంటిది. ఆయనతో సినిమా చేసినట్లు నా పిల్లలకు చెప్పుకోవడానికి వీలుంటుంది’ అన్నారు వరుణ్‌శర్మ. ముందుగా అతడితో కామెడీ చేయడమంటేనే భయమేసింది.

10/04/2018 - 02:09

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: రైళ్ల సమయ పాలన విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వవద్దని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రైల్వే జోనల్, డివిజినల్ అధికారులను హెచ్చరించారు. ఈ విషయంలో ప్రయాణికుల నుంచి సేకరించిన సమాచారానికి, జోన్ల అధికారులు ఇచ్చిన నివేదికలకు పొంతన ఉండటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

10/04/2018 - 02:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం గిరిజనులకు అటవీ భూములు కేటాయిస్తూనే వున్నాయని, ఈ విషయంలో అటవీ హక్కుల చట్టాన్ని అతిక్రమించిన కేసులేవీ తమ దృష్టికి రాలేదని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది. ఈ విషయంలో అలసత్వం, అవినీతి చోటుచేసుకుంటోందన్న ఆరోపణలను ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు తోసిపుచ్చారు.

10/04/2018 - 02:04

చెన్నై, అక్టోబర్ 3: రోజురోజుకు అనూహ్యంగా పెరిగిపోతున్న పెట్రోలు ధరల పెంపును నిరసిస్తూ పట్టాళి మక్కల్ కట్చి (పీఎంకే) పార్టీ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్టవ్య్రాప్తంగా ఈనెల ఐదున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆ పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు.

10/04/2018 - 01:37

తిరువనంతపురం, అక్టోబర్ 3: శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయాలనే యోచనేదీ లేదని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. శబరిమలలోని స్వామి అయ్యప్ప ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కూడా ఈ విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ వివరాలను కేరళ ముఖ్యమంత్రి పి విజయన్ విలేఖర్లకు తె లిపారు.

10/04/2018 - 01:08

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: భారత సైన్యానికి రాఫెల్ జెట్ విమానాలు అదనపు బలంగా మారుతాయని, ఈ డీల్ ఓ మంచి ప్యాకేజీ అని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోరా పేర్కొన్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో అధికార, విపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటున్న ఈ యుద్ధ విమానంపై ధనోరా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Pages