S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/04/2018 - 01:03

పూరీ, అక్టోబర్ 3: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీ జగన్నాధుని ఆలయంలో భక్తులకు క్యూలైన్లను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘జగన్నాథ్ సేన’ అనే సామాజిక, సాంస్కృతిక సంస్థ బుధవారం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో జరిగిన నిరసన ప్రదర్శన హింసకు దారితీసింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ విధ్వంసానికి దిగడంతో తొమ్మిదిమంది పోలీసులు గాయపడ్డారు.

10/04/2018 - 01:00

కోల్‌కతా, అక్టోబర్ 3: కోల్‌కతాలోని డమ్‌డమ్ నగర్‌బజార్ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకున్న పేలుడుపై పశ్చిమ బెంగాల్ క్రిమినల్ ఇనె్వస్టిగేషన్ డిపార్టుమెంట్ (సీఐడీ) దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనలో ఓ బాలుడు దుర్మరణం పాలవగా, తొమ్మిది మంది క్షతగాత్రులైన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే బెర్రాక్‌పోర్ పోలీసులు సుమోటో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

10/04/2018 - 00:33

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్నందున చీరల పంపిణి కార్యక్రమం కొనసాగుతున్నందున చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం సరికాదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపగా పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం చీరల పంపిణి ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది.

10/04/2018 - 00:17

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: సౌర విద్యుత్ రంగంలో భారత్ చేస్తున్న కృషికి గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి నుంచి చాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుకు ఫ్రాన్స్‌తో కలిసి ఎంపికైంది. కాగా, ప్రకృతి వైపరీత్యాలను పర్యావరణ పరిరక్షణ ద్వారానే సాధ్యమవుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

10/04/2018 - 00:39

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: అత్యవసరంగా చేపట్టేందుకు ప్రాతిపదిక ఉన్న కేసులకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలను జారీ చేస్తామని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు. 46వ సీజేఐగా ప్రమాణం స్వీకరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ అత్యవసర కేసులను ప్రస్తావించే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. రేపే మరణశిక్ష అమలు చేసేటట్లుంటే, అత్యవసర విషయమని అర్థం చేసుకుంటామన్నారు.

10/04/2018 - 00:09

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రంజన్ గొగోయ్ చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంగ్లంలో జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రమాణ స్వీకారం చేశారు. దేవుడి సాక్షిగా జస్టిస్ గొగోయ్ ప్రమాణం చేశారు.

10/03/2018 - 17:53

తిరువనంతపురం: అయ్యప్ప ఆలయానికి వచ్చే మహిళా భక్తులకు రక్షణ కల్పిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టంచేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీం కోర్టులో రివ్యూపిటిషన్ కూడా వెయ్యబోమని వెల్లడించారు.

10/03/2018 - 17:52

న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణకు పాటుపడేవారికి ఐక్యరాజ్యసమితి ఇచ్చే చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ పురస్కారాన్ని ప్రధాన నరేంద్ర మోదీ బుధవారంనాడు అందుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇది భారతీయులకు ఎంతో గౌరవప్రదమైందని అన్నారు.

10/03/2018 - 17:50

ముంబయి. బంగారం ధర భారీగా పెరిగింది. ఈరోజు ఒక్కరోజే రూ.555లకు పెరిగింది. పదిగ్రాముల పసిడి ధర రూ. 32,030లకు చేరుకుంది.

10/03/2018 - 17:50

లక్నో: ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే ప్రసక్తేలేదని బీఎస్సీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఆమె లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ ఏజెంటుగా వ్యవహరిస్తున్న దిగ్విజయ్‌సింగ్ పొత్తు అడ్డంకిగా మారారని అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఒంటరిగా పోటీచేస్తామని చెప్పారు.

Pages