S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/05/2018 - 12:14

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భేటీ అయ్యారు. కర్ణాటకలో ఇటీవల సంభవించిన వరదలు వల్ల దెబ్బతిన్న జిల్లాల్లో సహాయక చర్యలు, వౌలిక వసతుల కల్పనకు సాయం అందించాలని ముఖ్యమంత్రి రాజ్‌నాథ్‌ను కోరారు. కుమారస్వామితో పాటు మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ కూడా రాజ్‌నాథ్‌ను కలిసినవారిలో ఉన్నారు.

10/05/2018 - 12:12

చెన్నై: తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో అధికారులు అప్రమత్తమై కాంచీపురం, తిరువళ్లూరు, చెన్నైలలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 7వ తేదీన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చేసిన హెచ్చరికతో అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

10/05/2018 - 03:47

గురువారం ఢిల్లీలో జరిగిన మిషన్ గంగ సదస్సులో పాల్గొన్న వారితో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

10/05/2018 - 01:52

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాలలో శాంతిభద్రతల పర్యవేక్షణ, ఎన్నికల విధి నిర్వహణ నిమిత్తం మూడు రాష్ట్రాలకు 25వేల మంది పారామిలటరీ, పోలీసు దళాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో పనిచేస్తున్న రాష్ట్ర పోలీస్‌లకు వీరు అదనం.

10/05/2018 - 01:51

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు సంబంధించి కుదిరిన 60,150 కోట్ల ఒప్పందానికి సంబంధించి సమగ్ర ఆడిట్‌ను నిర్వహించాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (సీఏజీ)కి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.

10/05/2018 - 01:46

తిరువనంతపురం, అక్టోబర్ 4: శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు రాజకీయంగా వివాదంగా మారాయి. సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డిమాండ్ చేస్తుండగా, సీపీఎం మాత్రం రివ్యూ పిటిషన్‌కు ససేమిరా అంటోంది.

10/05/2018 - 01:46

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: సమాచార చట్టం ప్రకారం కోరిన విజ్ఞప్తి మేరకు తన డిగ్రీని, ఇతర విద్యార్హతలను బహిర్గతం చేసేందుకు అంగీకరించని పంజాబ్‌లోని భోలత్‌కు చెందిన ఆమ్‌ఆద్మీ పార్టీ శాసనసభ్యుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరా వైఖరిపై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని వ్యాఖ్యానించింది.

10/05/2018 - 01:44

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: లైంగిక వేధింపులకు గురైన బాలబాలికలు ముఫ్పై ఏళ్ల వయసు వచ్చే వరకు వారికి జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అనుమతించేలా కృషి చేస్తున్నామని కేంద్ర మహిళా శిశు సంక్షేమ, అభివృద్ధి శాఖ మంత్రి మేనకాగాంధీ తెలిపారు. ఇందుకు సంబంధిచిన ప్రతిపాదన తమ పరిశీలనలో ఉందని ఆమె తెలిపారు.

10/05/2018 - 01:43

బెంగళూరు, సెప్టెంబర్ 4: జవాబు పత్రాలపై దేవుళ్ల పేర్లు, మరేదైనా మతపరమైన కామెంట్లు రాసే విద్యార్థుల తీరును కర్నాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్ అధికారులు తప్పుపట్టుతున్నారు. మానవతా దృక్ఫథంతో కాకుండా మరోకోణంలో వారు ఆలోచిస్తూ ఆంక్షలు విధిస్తున్నారు.

10/05/2018 - 01:30

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: సెంట్రల్ రిజర్వ్ ప్రొటక్షన్ ఫోర్సు (సీఆర్ పీఎఫ్) ఇక తన పాత శిక్షణ పద్ధతులకు స్వస్తి పలకబోతోంది. సిఆర్‌పిఎఫ్‌లోకి కొత్తగా చేరిన వారికి ఇచ్చే శిక్షణలో ఉన్న లోపాలను అధిగమించడానికి ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రైనింగ్ సమయంలో శారీరక శిక్షణలో పలువురు సైనికులు గాయపడుతున్నారు. ఈ గాయాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందంటే వారిలో కొందరు జీవితాంతం గాయాలతో బాధపడుతున్నారు.

Pages