అక్షరాలోచన

మేఘం బద్దలయన వేళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక కల మిగిలిపోయంది... పూర్తిచేస్తావా?
రేపటి జ్ఞాపకానికి జీవాన్ని పోసి
మనసుని హిమశిఖరం మీదకు చేర్చి
నేను నడిచే దారుల్లో వెల్తురు పువ్వుల్ని పరుస్తావా?
గాయం తగిలిన చోట లేపనమై
గుండె శబ్దాన్ని అక్షరంగా మలిచి
అనురాగపు గూటిలో నన్ను నిలబెట్టగలవా?
గుండె పొరల్లో దుఃఖం ఉంటుంది
ఆత్మబంధువు కోసం హృదయం ఎదురుచూస్తుంది
సుడులు తిరుగుతున్న బాధల నదులుంటాయ
వరదలై ప్రవహిస్తున్న కన్నీళ్లు కన్పిస్తాయ
ధైర్యంగా గమ్యం తప్పిపోయన కలల్ని
ఒడిసి పట్టుకుని ఓదార్చగలవా?
ఒక కల కలగానే మిగిలిపోయంది
ప్రేమతో పూర్తిచేయగలవా?
మనం మనుషుల్లా బతికిపోతున్నాం కదా
మనసుని సమాధి మందిరంలో పెట్టి
నడుస్తూ సంచరిస్తూ కదిలెళ్లిపోతున్నాం
మనుషుల్లా మిగిలిపోవాలని కలగంటున్నాం
మన దగ్గర మానవ పరిమళం లేదు

సమూహంలో ఏకాకులమైపోతున్నాం
మనిషి ఒక మహత్తర మంత్రపుష్పం
నేనేదో నీతో మాట్లాడాలని సిద్ధపడ్తాను
కానీ ఈ నిశ్శబ్దానికి కారణం తెలీదు

ఎప్పటినుంచో ఒక కల మిగిలిపోయంది
దుఃఖాశ్రువుల సమ్మేళనపు సరసులా మారిపోయంది
మేఘం బద్దలయ కురిసిన వర్షంలో
ఎప్పటినుంచో దుఃఖంతో తడుస్తూ నిలబడ్డాను
కళ్లమీదనుంచి రెప్పలు నిదరలేవటం మార్చాయ
కోకిల గీతపు సంగీతాన్ని ఎవరో నిషేధించారు
నేను నేనుగా పరిమళించాలని కలగంటున్నాను
నేను ప్రవహించాలనుకుంటున్నాను
వందల వేల మైళ్లని ధైర్యంగా నడిచి
కలల్లో జ్ఞాపకాల్ని ఏరుకుంటూ
పల్లవించి పరవశించాలని తపన పడుతున్నాను

కానీ
కల పూర్తికాకుండానే మిగిలిపోయంది
ఒక కల కలగానే మిగిలుంది... పూర్తిచేస్తావా?

- జన్నతుల్ ఫిరదౌజ్ బేగం 9505961150