నల్గొండ

రోడ్డు భద్రత.. సామాజిక బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, జనవరి 21: రోడ్డు భద్రతను అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని నల్లగొండ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ కోరారు. కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ గురువారం కోదాడలో రోడ్డ్భుద్రతపై డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు.ఉద్యమం మాదిరిగా రోడ్డ్భుద్రతపై డ్రైవర్లలో, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. కేంద్రప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న మోటారువాహనాల చట్టంతో ప్రమాదం చేసిన డ్రైవర్లకు భారీగా జరిమానా విధించి జైలుకు పంపుతారని ఆయన వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనాలను నడిపితే ప్రమాదాలు జరగవని ఆయన స్పష్టం చేశారు. డ్రైవర్లు వాహనాలను నడిపే సందర్భంలో అప్రమత్తంగా వుండాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ, పక్కన వున్నవారితో కబుర్లు చెప్పుకొంటూ వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. 80 శాతం ప్రమాదాలు డ్రైవర్ నిర్లక్ష్యం, మానవతప్పిదంతోనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకొని సురక్షిత ప్రయాణం చేయాలని చంద్రశేఖర్‌గౌడ్ కోరారు. కార్యక్రమంలో యంవిఐ శ్రీనివాసరెడ్డి, సరిహద్దు చెక్‌పోస్టు యంవిఐ యస్.శ్రీనివాస్, కోదాడ పట్టణ ఇన్‌స్పెక్టర్ శ్రీ్ధర్‌రెడ్డి, లారీ ఓనర్స్ జిల్లా అధ్యక్షులు వెంకటనారాయణ, కోదాడ అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వర్‌రావు, నర్సరాజు, ఓరుగంటి ప్రభాకర్, ఎజిపి గట్ల నర్సింహరావు పాల్గొన్నారు.