నల్గొండ

లింగ నిర్ధారణ పరీక్షలపై కఠినంగా వ్యవహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 21: జిల్లాలో స్కానింగ్ సెంటర్లలో అక్రమంగా సాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించి భ్రూణ హత్యలు నివారించి ఆడ పిల్లలను సంరక్షించాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి లింగ నిర్ధారణ నిషేధ చట్టం పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్ష వహించి మాట్లాడారు. ఆడ, మగ వివక్షతపై ప్రజల్లో ఆలోచన విధానాల్లో మార్పు రావాలని ఇందుకు అధికార యంత్రాంగం స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కృషి చేయాలన్నారు. జిల్లాలో స్కానింగ్ కేంద్రాల పనితీరుపై ఏడాది నుండి ఒక కేసు కూడా నమోదు చేయకపోవడం విజెలెన్స్, మానిటరింగ్ లోపంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో లింగ వివక్షతను తెలుసుకునేందుకు రాష్ట్రంలోని హైద్రాబాద్, రంగారెడ్డి మినహా ఇతర ఎనిమిది జిల్లాల నుండి స్కానింగ్ సెంటర్ల నివేదికలు సమర్పించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. జిల్లాలో 1981లో 0-6వయసులో ప్రతి వేయి మంది బాలురకు 1001మంది బాలికలు ఉండగా, 1991లో 994, 2001లో 952, 2011కు వచ్చేసరికి 921కి పడిపోయిన తీరు లింగవివక్ష పెరుగుతున్న తీరుకు నిదర్శనంగా ఆందోళన కల్గిస్తుందన్నారు. నారాయణపురం మండలంలో ప్రతి వేయి మందికి 833మంది బాలికలు, చందంపేటలో 834, మునుగోడులో 842, పెద్దవూరాలో 850, త్రిపురారంలో 853, భువనగిరిలో 856, మర్రిగూడలో 863, పోచంపల్లిలో 867, చిట్యాలలో 883, ఆత్మకూర్(ఎం)లో 892మంది ఉన్నారన్నారు. స్కానింగ్ రిపోర్టుల విషయంలో భౌతికంగా హార్డ్‌కాపీలు, సాఫ్ట్ కాపీలు తనిఖీ నేపధ్యంలో భద్రపరుచుకోవాలన్నారు. స్కానింగ్ కారణాలు నమోదు చేసి ఆధారాలు చూపడంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. పుట్టిన ఆడపిల్లలను వదిలి వెళ్లడం, చంపడం, విక్రయించడం జరుగుతున్నందున ఈ రకమైన అనాగరిక పోకడల నివారణపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో లింగ వివక్షత అధికంగా ఉన్న 10మండలాల్లో స్కానింగ్ సెంటర్ల నిర్వహణ తీరుపై ప్రత్యేక నిఘా సారించాలన్నారు. ఆడపిల్లలను కాపాడుకునేలా ప్రజలను జాగృత పరుచాలన్నారు. వరకట్నం ఇతర సంస్కృతి, సంప్రదాయాల పేరుతో ఆడంబరాలకు గొప్పలకు పోతు పేదలు ఆర్ధిక ఇబ్బందుల్లో పడకుండా సామాజిక సేవా సంస్థలు ప్రచారం సాగించాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌వో రవినాయక్, డిఎంహెచ్‌వో భానుప్రసాద్ నాయక్, తిరుపతయ్య, బాలునరేంద్ర, సిడిపివో కృష్ణవేణి, వైద్యాధికారులు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

కళాశాలల బంద్ విజయవంతం
మిర్యాలగూడ, జనవరి 21: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బిసి సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు బిసి విద్యార్థి సంఘం, బిసి ఫ్రంట్, బిసి ఐక్యవేదికల ఆధ్వర్యంలో గురువారం కళాశాలల బంద్ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా బిసి సంఘం రాష్ట్ర కార్యదర్శి పగిడి జీడయ్యయాదవ్ మాట్లాడుతూ 2014-15విద్యాసంవత్సరానికి సంబంధించిన రూ.1800 కోట్లు, 2015-16సంవత్సరానికి సంబంధించిన రూ.2800 కోట్ల స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకపోవడం వలన పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని అన్నారు. ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకపోవడం వలన కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్దులపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బిసి ఫ్రంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిరుమలగిరి అంజి మాట్లాడుతూ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటే రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యార్దులు మరింత కష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యార్థులకు సవతితల్లి ప్రేమను చూపిస్తున్నారని వెంటనే ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తొలుత కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఆర్డీఓ కిషన్‌రావుకు వినతిపత్రాన్ని అందచేశారు. కార్యక్రమంలో బిసి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు తిరుమలగిరి అశోక్, సంఘం డివిజన్ అధ్యక్షులు మహేశ్‌గౌడ్, రాధిక, శిరీష, స్వాతి, వనజ, హుస్సేన్, కిరణ్, నరేష్, నాగరాజు, జీడయ్యయాదవ్, రాచూరి మహేశ్, నరేష్, ప్రసాద్, గోపి, నాగరాజు పాల్గొన్నారు.