నల్గొండ

ఇంటింటికీ గ్యాస్, నల్లా కనెక్షన్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాంపల్లి, జనవరి 21: తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని కట్టెల పొయ్యిని వీడి గ్యాస్‌ను వినియోగించుకునేందుకు దీపం పథకంద్వారా గ్యాస్ కనెక్షన్‌లను అందిస్తుందని, అలాగే నల్లా కనెక్షన్‌ల ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని కూడా అందిస్తుందని మునుగోడు శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద దీపం పథకం క్రింద మంజూరైన గ్యాస్‌కనెక్షన్‌లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 796గ్యాస్‌కనెక్షన్‌లు మంజూరు కాగా 494 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలిన వారికి రెండవ విడతలో అందించనున్నట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో 5వేల కనెక్షన్‌లను అందిచామన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇంటింటికి నల్లా కనెక్షన్‌లను అందించే దిశగా కృషిచేస్తున్నారని అందుకోసం మండలంలోని లింగోటం గ్రామంలో నీటిశుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నామని, పనులను త్వరలో ప్రారంభిచనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మార్చినుండి 9గంటల విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా నాంపల్లి నుండి మర్రిగూడ రోడ్డు, మండలంలో నెలకొన్న మారుమూల గ్రామాలలో ఉన్న రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మండలాన్ని కరువు మండలంగా ప్రకటిస్తామని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో గులాబి జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దండిగ నాగమణివెంకటయ్య, జడ్పీటీసి ఎ.శే్వతారవీందర్‌రెడ్డి, నాంపల్లి సర్పంచ్ శైలజాశ్యాంసుందర్, వైస్ ఎంపిపి కవితావెంకటేశ్వర్లు, రమేష్, నాంపల్లి గ్యాస్ డిస్టిబ్యూటర్ వసంతాయుగేందర్, ఎంపిడివో హనుమంత్‌ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటీసిలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థులు పాల్గొన్నారు.