నల్గొండ

కన్నులపండువగా ఉర్సు మహోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, జనవరి 21: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన మతసామరస్యానికి చిహ్నమైన నేరేడుచర్ల మండలంలోని జాన్‌పహాడ్ దర్గాలో గురువారం కన్నులపండువగా, సంప్రదాయసిద్ధంగా ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు జరిగే ఉర్సు ఉత్సవాలలో భాగంగా మొదటి రోజయిన గురువారం వేకువజామునే దర్గా కిద్మప్‌గుజార్ సయ్యద్ మొయినొద్దిన్ గృహం నుండి మేళతాళాలలతో, బట్టీలతో ఊరేగింపుగా దర్గాకు చేరుకున్నారు. దర్గాలోని అజ్రత్ సయ్యద్, మొయినొద్దిన్‌షా సమాధులకు మగ్రీద్‌నమాజ్, ఇషానమాజ్ కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూలమాలలతో, బట్టీలతో, గంధంతో అలంకరించిన సమాధులు నూతన శోభతో భక్తులను ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని వివిద ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు తెచ్చిన పూలమాలలు, బట్టీలతో ప్రత్యేక నమాజు చేసి అలంకరించారు. మహిళలు, పురుషులు భక్తిశ్రద్ధలతో సమాదుల చుట్టు కొవ్వత్తులు వెలిగించారు. భక్తులు దర్గా వెలుపల కొబ్బరికాయలు కొట్టి సైదులుబాబాను దర్శించుకోని మొక్కులు తీర్చుకున్నారు. నాగుపాము పుట్ట వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుండి గతంలో లేని విధంగా ప్రారంభం రోజు భక్తులు హాజరయ్యారు. దర్గా కిద్మప్‌గుజార్ మొయినొద్దిన్ ప్రత్యేకంగా తయారుచేసిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఉర్సు సందర్భంగా విద్యుత్ దీపాలంకరణలో పరిసర ప్రాంతం విద్యుత్ కాంతులతో నిండిపోయింది. ఉర్సు ఉత్సవంలో భాగంగా రెండోరోజు శుక్రవారం వక్ఫ్‌బోర్డు హైద్రాబాద్ నుండి తెచ్చిన గంధం ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ 400మంది సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల అవసరాల కోసం అన్ని శాఖలు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు.
56సంవత్సరాలుగా ఉర్సుకు వస్తున్న భక్తులు:- ఖమ్మం జిల్లా తల్లంపాడుకు చెందిన 86సంవత్సరాల సురభి నారాయణ 56సంవత్సరాలుగా జాన్‌పహాడ్ దర్గా ఉర్సుకు హాజరవుతున్నారు. గురువారం జరుగుతున్న ఉర్సుకు వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ 35సంవత్సరాల వయస్సు నుండి దర్గా ఉర్సుకు వస్తున్నట్లు, ఇక్కడ అంతగా భక్తులు సంచారం లేని సమయం నుండి వస్తున్నట్లు, ఇప్పటికే మూడు గుర్రాలు విరాళంగా ఇచ్చినట్లు, ప్రతి సంవత్సరం ఉర్సు సందర్భంగా దర్గా పూజారికి అవసరమైన గంధాన్ని సమర్పిస్తున్నట్లు తెలిపారు.
అన్ని అవసరాలకు తాగునీరే:- ఈసంవత్సరం వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, సాగర్ కాల్వకు నీరు రాకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి దర్గా వద్ద సఫాయి బావితోపాటు బోర్లలోని నీరు లేకపోవడంతో తాగునీటినే భక్తులు స్నానాలకు, బట్టలు ఉతుక్కోవడానికి, వివిధ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. దీంతో మంచినీటి ట్యాంకు పరిసర ప్రాంతం బురదమయం కావడంతో భక్తులు రోగాల భారిన పడే అవకాశం ఉంది. తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తే శుక్రవారం జరిగే గంధం ఊరేగింపునకు రెండు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు హాజరవుతారని, దీంతో తాగునీటి కొరత తీవ్రంగా ఏర్పడే అవకాశం ఉన్నందున అధికారులు గమనించి తాగునీటితోపాటు ఇతర అవసరాలకు కూడా నీరందించాలని భక్తులు కోరుతున్నారు. ఉర్సు ప్రారంభంరోజు దర్గా పర్యవేక్షణ అధికారి ఫయాజొద్దిన్, ఎస్‌ఐ డి.వెంకటేశ్వర్లు, సర్పంచ్ ఖాజాఫాతిమా, కాంట్రాక్టర్ సుబ్బారావు, ఎంపిటిసి గనె్న సైదా, సాంఘీక సంక్షేమశాఖ అధికారి మధునాయక్, వికాస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గోళ్ల సుధాకర్, ప్రముఖ వ్యాపారవేత్తలు, పుట్టల కృపాకర్, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.