నల్గొండ

కేంద్రీయ విద్యాలయాల్లో నాణ్యతా ప్రమాణాలతో విద్యాబోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, జూన్ 22: కేంద్రీయ విద్యాలయాల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు నాణ్యతాప్రమాణాలతో కూడిన విద్యాబోధన అందించడం జరుగుతుందని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడెం సమీపంలో రూ.15.25కోట్లతో నిర్మిస్తున్న కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కేంద్రీయ విద్యాలయాల్లో విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు. విద్యాలయాల్లో ఆంగ్లం, హిందీ, సంస్కృతం సమానంగా బోధించడం జరుగుతుందన్నారు. 2014లో దేశంలో కేంద్ర ప్రభుత్వం 50 కేంద్రీయ విద్యాలయాలను మంజూరుచేయగా 8 కేంద్రీయ విద్యాలయాలు తెలంగాణాకు మంజూరు చేసిందన్నారు. కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం తాత్కాలికంగా విద్యాబోధన చేస్తున్న భవనంలోనే 8వ తరగతిని కూడా ప్రారంభించామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో నూతన భవనంలో విద్యా బోధన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. త్వరితగతిన, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా భవనం నిర్మించాలని ఆయన తెలిపారు. పాఠశాల భవనంతోపాటు ఉద్యోగులకు వసతి గృహాలను కూడా నిర్మించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా సూర్యాపేట, భువనగిరి జిల్లాలకు కూడా కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందన్నారు. ఆ జిల్లాలకు కూడా త్వరలోనే కేంద్రీయ విద్యాలయాలు మంజూరవుతాయని అన్నారు. సూర్యాపేటలో కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలం, తాత్కాలికంగా పాఠశాల నిర్వహించేందుకు భవనాన్ని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారన్నారు. ఇలా ఉండగా ముఖ్యమంత్రి కెసిఆర్ సిఎంఆర్‌ఎఫ్ నిధుల మంజూరులో వివక్ష చూపుతున్నారని కోమటిరెడ్డి విమర్శలు చేశారు అని విలేఖరులు ఎంపిని ప్రశ్నించగా.. మతిస్థిమితంలో ఉండి మాట్లాడే వ్యక్తులకు సమాధానం చెప్పవచ్చుకాని మతిస్థిమితం లేకుండా మాట్లాడే వారి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని అన్నారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎలాంటి వివక్ష చూపించకుండా అన్ని నియోజకవర్గాలలోని అర్హులైన పేదలకు సిఎంఆర్‌ఎఫ్ నిధులను మంజూరు చేస్తునట్లు స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని అన్నారు. నల్లగొండ నియోజకవర్గానికి సుమారు 7నుండి 8కోట్ల రూపాయలు సిఎంఆర్‌ఎఫ్ నుండి లబ్ధిదారులకు మంజూరయ్యాయని, మిగిలిన ఏ నియోజకవర్గంలో అంతమొత్తంలో నిధులు మంజూరుకాలేదన్నారు. కార్యక్రమంలో ఎంపిపి ఒగ్గు జానయ్య, ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రావు, నాయకులు నామిరెడ్డి కర్నాకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, చిట్టిబాబునాయక్, రవీందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.