నల్గొండ

కులవృత్తులకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలుకూరు, జూన్ 22: గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు విద్యుత్, దళిత అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రామాపురం గ్రామంలో జరిగిన నియోజకవర్గ స్థాయి గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధన కోసం గ్రామీణ స్థాయిలో అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రకాల కులవృత్తులకు కెసిఆర్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఎన్డీసిసి నిబంధనల ప్రకారం రిజిస్ట్రర్డు సొసైటీలోని ప్రతి సభ్యునికి గొర్రెల యూనిట్లు అందిస్తామని తెలిపారు. కులపరంగా కాదని ఎమ్మెల్యే పద్మావతి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. యాదవులందరికి రెండు దఫాలు కాకుండా ఒకేసారి గొర్రెలు పంపిణీ చేయాలని జడ్పీటిసి బట్టు శివాజి కోరగా మార్కెట్ సౌకర్యం ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో రెండు విడతలుగా పంపిణీ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సభకు అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా యాదవ కులాలు ఆర్థికంగా ఎదగాలని సూర్యాపేట జిల్లాకు రూ.311 కోట్లు సబ్సిడీ ప్రభుత్వం అందించినట్లు తెలిపారు. గొర్రెల మేతకు తైలో విత్తనాలు, ఆరోగ్య అవసరాలకు జివమిత్రలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా 18మంది లభ్దిదారులకు 378 గొర్రెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, కోదాడ మార్కెట్ చైర్మన్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, జడ్పీటిసి బట్టు శివాజినాయక్, ఎంపిపి బొలిశెట్టి నాగేంద్రబాబు, ఆర్డీవో బిక్షునాయక్, సర్పంచ్ నిగిడాల వీరయ్య, నాయకులు కొల్లు స్వామి, అచ్చయ్య, కిరణ్‌కుమార్, ఆనందరావు, పద్మ తదితరులు పాల్గొన్నారు.