నల్గొండ

నీలి విప్లవంతో ఆర్థికంగా ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూన్ 23: రాష్ట్ర ప్రభుత్వం నీలి విప్లవం ద్వారా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపట్టిందని, మత్య్స కార్మికులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా మత్య్స శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చేపల పెంపకం పద్ధతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలోని చెరువులు, కుంటల్లో గతేడాది రెండున్నర కోట్ల చేప పిల్లలను వదిలిందన్నారు. ఈ ఏడాది 5 కోట్ల మేరకు చేప పిల్లల పంపిణీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మత్య్స కార్మికులు చేప పిల్లల పెంపకం, అమ్మకాల ద్వారా తమ ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచుకోవాలన్నారు. చేపలతో రూపొందించే వివిధ ఆహార ఉత్పత్తుల తయారీ పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వం చేపల పెంపకానికి చెరువుల నిర్మాణం, ఉత్పాదకాలు, కేజ్‌లలో చేపల పెంపకం వంటి వాటికి సబ్సిడీ రుణాలందిస్తుందని, వాటిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో త్వరగా బరువు పెరిగే చేపల జాతులను ఎంపిక చేసుకుని అధిక లాభాలను గడించేందుకు కృషి చేయాలన్నారు. భారతీయ మేజర్ కార్ప్ చేపలు, కృష్ణ బొచ్చె, రవ్వ, రాగండి, విదేశీ మేజర్ కార్ప్ చేపలు, గడ్డి చేప, బంగారు తీగ వంటి వాటిని పెంచడం ద్వారా మెరుగైన లాభాలు పొందవచ్చన్నారు. 22, 25 మిల్లీ మీటర్ల సైజ్ పెరిగిన చేప పిల్లలను చెరువులో వదిలేందుకు ఎంపిక చేసుకోవాలన్నారు. చేప పిల్లల పెంపకం, ఆహారం అందించడంలో నిపుణుల సూచనలు పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా శాస్తవ్రేత్తలు లవకుమార్, వీరాంజనేయులు చేపల పెంపకంపై మెళకువలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా మత్య్స శాఖ అధికారి యం.చరిత, మత్య్స అభివృద్ధి అధికారి షకీలా భాను, ఆర్డీవో వెంకటాచారి, అధికారులు శ్రీనివాస్, ప్రసాద్, వివిధ మత్య్స కార్మిక సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, మత్య్స కార్మికులు తదితరులు పాల్గొన్నారు.