నల్గొండ

24గంటల్లోనే డబుల్‌బెడ్‌రూం ఇళ్ల బిల్లుల చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూన్ 23: జిల్లాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు దశల వారీగా పూర్తిచేసిన పనులకు 24గంటల్లోనే బిల్లులు చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ కె. సురేంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల ప్రగతిపై ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణాలకు ఉపయోగపడే ప్లైయాష్‌ను కెటిపిఎస్ నుంచి ఉచిత రవాణా ఖర్చులు లేకుండా అందజేయనున్నట్లు తెలిపారు. ఆర్ ఎండ్ బికి 225 టన్నులు, పంచాయతీరాజ్‌కు 60 టన్నులు కేటాయించినట్లు తెలిపారు. అదే విధంగా నిర్మాణ పనులకు పులిచింతల నుండి 80వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. పులిచింతల ముంపు గ్రామాలైన వెల్లటూరు, గుండ్లపల్లిల నుండి ఇసుక సేకరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టినందున అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిని పనులు పూర్తిచేయించేలా చూడాలని ఆదేశించారు. ఎర్రారంలో నిర్మాణ పనుల అగ్రిమెంట్‌కు 45రోజులు గడిచిన్నపట్పికి పనులు పెండింగ్‌లో ఉంచిన పంచాయతీ రాజ్ ఎస్‌ఈతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే అగ్రిమెంట్ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. అధికారులు ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరారు. అధికారుల మధ్య సమన్వయం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. చిన్నచిన్న సమస్యలను సాకుగా చూపి పనులు జాప్యం చేయరాదని కోరారు. ఇండ్ల పనులను వేగంగా నాణ్యతతో పూర్తిచేసిన ఏజెన్సీలకు అదనంగా పనులను నామినేషన్‌పై అప్పగించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో డిఆర్వో పబ్బతిరెడ్డి యాదిరెడ్డి, ఆర్డీవోలు మోహన్‌రావు, భిక్షునాయక్, ఆర్‌ఎండిబి ఈఈ గోవర్దన్‌రెడ్డి, పిఆర్ ఎఈ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.