నల్గొండ

గరగపర్రు ఘటనపై దర్యాప్తు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, జూన్ 25: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేశారని దళితులను అగ్రవర్ణాలు గత రెండు నెలలుగా సామాజిక బహిష్కరణ విధించిన సంఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేయించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని మాదిగ అభివృద్ధి సేవాసమితి అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి గుర్వయ్య, ప్రధానకార్యదర్శి గంధం యాదగిరి డిమాండ్ చేశారు. కోదాడలో ఆదివారం వారు విలేఖరులతో మాట్లాడారు. సంఘటనను మాస్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు ప్రకటించారు. గ్రామంలో దళితులతో మాట్లాడితే వేయి రూలు, పనులు చేయించుకొం టే పది వేలు జరిమానాలను ప్రకటించారని వారు చెప్పారు. దళితులు కౌలుకు చేసే పొలాలను వెనక్కి తీసుకొన్నారని వారు చెప్పారు. దళితుల సామాజిక బహిష్కరణపై కలెక్టర్‌కు చెప్పినా న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికైనా బాధ్యులపై చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతంగాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అమరబోయిన గోపి, గంధం పాండు, డాక్టర్ ఆనంద్, గుండెపంగు రమేష్, కర్ల కాంతారావు, బుచ్చారావు, శ్రీకాంత్, మధు, శేఖర్, మోష, జయసూర్య, తదితరులు పాల్గొన్నారు.