నల్గొండ

లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట టౌన్, జూన్ 25: లయన్స్‌క్లబ్ కంటి ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. ఆదివారం స్థానిక సాయిబాబా ఫంక్షన్ హాల్‌లో లయన్స్‌క్లబ్ ఆఫ్ సూర్యాపేట 44వ కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం క్లబ్ నూతన అధ్యక్షుడు పటేల్ నర్సింహ్మరెడ్డి, ప్రధానకార్యదర్శి యాదా కిరణ్‌కుమార్, కోశాధికారి ఎం.నాగేశ్వర్‌రావులచే క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం.రామానుజాచార్యులు, జిగిని బీమయ్యప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ మీలా సత్యనారాయణ, లయన్స్‌క్లబ్ జోనల్ చైర్మన్ బండారు రాజా, జోన్ చైర్మన్ డి. రవికుమార్, డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ నేతి రఘుపతి, దార కృష్ణారావు, యానాల ప్రభాకర్‌రెడ్డి, గజ్జి పుల్లయ్య, కొల్లూరి కొండయ్య, వనజ, మందడి రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.