విశాఖపట్నం

మళ్లీ ఆంత్రాక్స్ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, జూన్ 25: విశాఖ ఏజెన్సీకి చెందిన మంగులయ్య, సోమన్న, కృష్ణ, గుండు ప్రస్తుతం విశాఖ కెజిహెచ్‌లోని ప్రత్యేక వార్డులో ఆంత్రాక్స్‌కు చికిత్స పొందుతున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా అప్రమత్తమైన అధికారులు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశాలపై వైద్య, ఆరోగ్యశాఖాధికారులు వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. కోడిపుంజువలస గ్రామంలో నిల్వ మాంసం తినడంతోనే ఈ లక్షణాలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించామని, వారందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కెజిహెచ్‌కు తరలించామన్నారు. ఆంత్రాక్స్ లక్షణాలు కలిగిన గ్రామాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేసి అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరిస్తున్నామని జిల్లావైద్య,ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ ఉమా సుందరి తెలిపారు. ఇప్పటికే అరకులోయ, ముంచుంగ్‌పుట్, హుకుంపేట, వైద్యాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసామని, సీజనల్ వ్యాదులపట్ల అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరో విషయం ఏమిటంటే గిరిజన గ్రామాల్లో ఉన్న పశువులకు టీకాలతోపాటు జాగ్రత్తలు చెప్పాల్సిన వెటర్నరీ శాఖ అధికారులు నిర్లక్ష్యం, కనీసం పట్టించుకోకపోవడంతో పశువుల్లో వ్యాధుల తీవ్రత పెరిగి పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏడాది లక్షణాలు బయటపడిన తరువాతే అధికారులు అప్రమత్తమై హడావుడి చేస్తున్నారు. తప్పితే ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో సమస్య రోజురోజుకీ తీవ్రతరమవుతుంది. ఇప్పటికైనా వెటర్నరీ శాఖ అధికారులు ఏజెన్సీ ప్రాంతాల్లో పశువుల వ్యాధులపట్ల నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో ఆంత్రాక్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.