నల్గొండ

2.2 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, జూలై 20: నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు 26 లక్షల మొక్కలు నాటామని జాయింట్ కలెక్టర్ సి నారాయణరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక మండల తహశీల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటిన అనంతరం మాట్లాడుతూ జిల్లాలో హరితహారం కింద సుమారు 2.2కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యమన్నారు. రైతుల పొలాల వద్ద సుమారు 60 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. ఏ శాఖ మొక్క నాటినా ఉపాధి హామీ పధకం కిందనే నిర్వహిస్తున్నారమన్నారు. ఏదైనా సంస్థ, విద్యాలయం, పొలం వద్ద 50 మొక్కలు నాటితే వాటి రక్షణ బాధ్యత కింద జాబ్‌కార్డు ఉన్న ఉపాధి హామీ కూలిని ఏర్పాటు చేస్తామన్నారు. పిడిఎస్ బియ్యం అమ్మకాల దందాను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కస్టం మిల్లింగ్ కింద ఇంకా 46 శాతం బియ్యం రైస్‌మిల్లుల నుండి రావాల్సి ఉందన్నారు. 2.27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో ఇప్పటి వరకు 1.24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చారన్నారు. ఆగస్టు 31లోగా మిగిలిన బియ్యం ఇవ్వకుంటే మిల్లింగ్ చార్జీలు ఇవ్వమని, పౌరసరఫరాల చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లా నుండి 5 జిల్లాలకు బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు.
నూరుశాతం మెరుగ్గా రెవెన్యూ రికార్డులకు కృషి..
జిల్లాలో నూరు శాతం రెవెన్యూ రికార్డులు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని జెసి నారాయణరెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండల తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల నిర్వహణ గురించి ప్రతి విఆర్‌ఓ పహాణిలను ఆయన పరిశీలించారు. విఆర్‌ఓలపై ఉన్న నమ్మకం పోవద్దని, గట్టిగా పని చేసి పేరు తీసుకురావాలన్నారు. పని నేర్చుకోవాలని, నేర్చుకోకుంటే ఇబ్బందుల పాలవుతారన్నారు. రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేవని ప్రతి ఒక్కరు అంటున్నారని, ఆ అపవాదు పోయేందుకు కృషి చేయాలన్నారు. ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తుండాలన్నారు. పెండింగ్ పెడితే విఆర్‌ఓలకే ఇబ్బంది అవుతుందన్నారు. ఆయన వెంట తహశీల్దార్ మాలి కృష్ణారెడ్డి, డిప్యూటీ తహశీల్దార్‌లు రామకృష్ణారెడ్డి, అనసూయ, ఆర్‌ఐ వెంకటేశ్వరరావు, విఆర్‌ఓలు రామకృష్ణ, సురేష్, సయిద్ ఉన్నారు.