విశాఖపట్నం

క్రేన్ వ్యాపారి హత్య కేసులో స్థానికుల హస్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), జూలై 20: ఈనెల 17న బీచ్‌రోడ్డులోని పామ్‌బీచ్ హోటల్ ఎదురుగా గల సీ-సర్ఫ్ అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తులో ఉంటున్న క్రేన్ల వ్యాపారి విక్రమ్ ధమీజాను, భార్య జ్యోతిని, డ్రైవర్ జనార్దన్‌ను దారుణంగా కత్తులతో అగంతకులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో చికిత్స పొందుతున్న విక్రమ్ మృతి చెందగా, డ్రైవర్ జనార్దన్, జ్యోతి ప్రాణాపాయం నుండి బయట పడిన విషయం తెలిసిందే.
డబ్బుల కోసమే ఈ హత్యాకాండ
హతుడు విక్రమ్ ఇంట్లోనే ఆఫీసు ఏర్పాటు చేసి, క్రేన్ల అమ్మకం, అద్దెలకు సంబంధించి లక్షలాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరుపుతున్నట్టు అగంతకులకు తెలిసింది. అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారిలో అత్యధిక ధనవంతుడు విక్రమ్. ఇది గమనించిన సూపర్‌వైజర్ సత్యనారాయణమూర్తి బీచ్‌రోడ్డులో పకోడీ వ్యాపారం చేస్తున్న షరీఫ్‌కు చెప్పాడు. వీరిద్దరి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఏ విధంగానైన పథకం వేసి విక్రమ్ ఇంట్లో దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు.
దీంతో జార్ఖండ్‌లో ఉన్న బంధువు మున్నాకు ఈ విషయాన్ని షరీఫ్ చెప్పి దోపిడీకి పథకం వేశారు. తనకు పరిచయం ఉన్న బీహార్ ముఠాతో మున్నా మాట్లాడి విక్రమ్ ఇంట్లో దోపిడీ చేసి, భారీ మొత్తంలో చోరీకి వీరంతా సిద్ధమయ్యారు.
స్కార్పియోలో వచ్చిన బీహార్ ముఠా
ఈ నెల 17 సాయంత్రం సమయంలో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం స్కార్పియోలో బీహార్ ముఠా అపార్ట్‌మెంట్ సమీపంలో ఆగి సిగ్నల్ కోసం వేచి ఉన్నారు. అపార్ట్‌మెంట్ సూపర్‌వైజర్ సత్యనారాయణ, వాటర్ మోటార్ ఆన్ చేయమని వాచ్‌మెన్‌కు చెప్పి గేట్ దగ్గర నుండి అపార్ట్‌మెంట్ పైకి పంపించి, బయట వేచి ఉన్న షరీఫ్, మున్నాలకు సిగ్నల్ ఇచ్చాడు. దీంతో స్కార్పియోలో ఉన్న బీహార్ ముఠా సభ్యులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుని, అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డారు. ముందుగా నలుగురు వెళ్లి తలుపు కొట్టడంతో డ్రైవర్ జనార్దన్ తలుపు తీశాడు. అగంతకులు విక్రమ్ గురించి అడగ్గా, లోపల ఉన్నారని చెప్పడంతో వారు విక్రమ్ ఉన్న చోటుకు వెళ్ళారు. విక్రమ్‌ను, అతని భార్య జ్యోతిని ఈ నలుగురు చుట్టుముట్టి డబ్బులు తీయమని, లేకపోతే చంపేస్తామని బెదిరించడం ప్రారంభించారు. ఇది గమనించిన డ్రైవర్ జనార్దన్ అపార్ట్‌మెంట్ వాసులకు సమాచారం ఇద్దామని వెళుతుండగా బయట వేచి ఉన్న ముఠాలోని మరో ఇద్దరు అతనిని అడ్డుకున్నారు. దీంతో వారిపై డ్రైవర్ తిరగబడి కేకలు వేస్తూ ఒకరి కాళ్లు పట్టుకోవడంతో వీపుపై, కడుపులో కత్తులతో పొడిచారు. అరుపులు విన్న విక్రమ్ నలుగురిని తప్పించుకుని డ్రైవర్ వద్దకు చేరుకుని, వారిపై తిరగబడి కొట్టడానికి ప్రయత్నించగా అతని చాతీ, కడుపులో కత్తులతో దాడి చేసి వెంటనే అక్కడి నుండి పారిపోయారు. ఇది గమనించిన భార్య జ్యోతి వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించగా, కడుపులో గాయాల పాలైన డ్రైవర్ మెట్ల మార్గం గుండా కిందకు దిగి సెల్లార్‌లో పడిపోవడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే అగంతకులు కిందకు దిగి అటుగా వస్తున్న ఆటోను ఆపారు. ఆ ఆటో ఆపకపోవడంతో ఉడాపార్కు వైపు వెళ్తున్న మరో ఆటోను ఆపి అందులో ఎక్కి వీరు సమీపంలోని కొటాక్ స్కూలు వద్ద దిగి ఆటోడ్రైవర్‌కు రూ.30లు ఇచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న స్కార్పియో వాహనం ఎక్కి ముఠా సభ్యులంతా పలాయనం చిత్తగించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన జరిగిన 40నిముషాలు తర్వాత అక్కడకు చేరుకున్నారు. సంఘటన స్థలానికి ఆలస్యంగా పోలీసులు వెళ్లడం పట్ల సిపి యోగానంద్ సిబ్బందిపై సీరియస్ అయినట్టు తెలిసింది. వ్యాపార లావాదేవీల లేక ఎవరైన ప్రత్యర్థి ఈ పని చేసి ఉంటాడని పోలీసులు మొదట భావించారు. సంఘటన జరిగిన తీరును పరిశీలించిన పోలీసలు అగంతకులు దోపిడి కోసం విక్రమ్ ఇంట్లోకి చొరబడినట్టు గుర్తించారు. ఆరుగురు ఈ సంఘటనలో పాల్గొన్నట్టు ప్రాధమికంగా తొలుత పోలీసులు గుర్తించారు. స్థానికుల ప్రమేయం లేకుండా జరిగే అవకాశం లేదని గుర్తించిన పోలీసులు అపార్ట్‌మెంట్ సూపర్‌వైజర్ సత్యనారాయణ, పకోడి బండి షరీఫ్ సహకారంతో బీహార్ ముఠా ఈ ఘతుకానికి పాల్పడినట్టు నిర్థారణకు వచ్చారు. దీంతో వీరిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. ఆటోడ్రైవర్‌కు ఈ కేసులో సంబంధం లేదని తెలుసుకున్న పోలీసులు అతనిని వదిలేసినట్టు తెలిసింది. షరీఫ్ బంధువు మున్నాయే ఈ ముఠాను ఇక్కడకు తీసుకుని వచ్చి దోపిడికి ప్రయత్నించినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు.
అగంతకులకు సరెండ్ అయి ఉంటే విక్రమ్ బతికేవాడు
దోపిడికి ఇంట్లోకి ప్రవేశించిన బీహార్ ముఠాకు విక్రమ్ సహకరించి ఉంటే అతను బతికి ఉండేవాడని పోలీసులంటున్నారు. ముఠా సభ్యులు విక్రమ్ ను చుట్టుముట్టి డబ్బులు కోసం మాట్లాడుతుండగా డ్రైవర్ బయటకు రావడం అక్కడే ఉన్న అగంతకులు అతనిని అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ డ్రైవర్ వారిపై తిరగబడి ఉండకపోతే వారు కత్తులతో అతనిపైన, విక్రమ్‌పైన దాడి చేసే వారు కాదని, దోపిడి చేసి వెళ్లిపోయే వారని పోలీసులంటున్నారు.
ప్రత్యేక బృందాల అదుపులో ముగ్గురు బీహార్ ముఠా సభ్యులు?
సంఘటన జరిగిన వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను అధికారులు రంగంలోకి దిగారు. బీహార్, పాట్న, జార్ఖండ్ ప్రాంతాలకు ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్లాయి. గురువారం నాటికి ముఠాలోని ముగ్గురు ప్రత్యేక పోలీసు బృందాలకు చిక్కినట్టు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే కేసు చిక్కుముడి వీడిపోతుందని పోలీసు వర్గాలంటున్నాయి.