నల్గొండ

డబుల్ బెడ్‌రూం పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, : నిరుపేదలకు అన్ని వసతులతో కూడిన సొంత ఇంటిని కల్పించాలనే లక్ష్యంతో సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకం పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ కార్పొరేషన్ చైర్మన్ ఎం.్భమిరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల ప్రగతిపై జిల్లా కలెక్టర్, ఆర్‌అండ్‌బి, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు అన్ని వసతులతో కూడిన ఇంటిని నిర్మించి ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపం లేకుండా కాంట్రాక్టర్లు ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇండ్ల నిర్మాణాల విషయంలో సమస్యలు ఉత్పన్నమైతే తక్షణమే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరారు. గ్రామాల్లో సర్వే చేయించి అనువైన చోట నిర్మాణాలు చేపట్టాలన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో సూర్యాపేట జిల్లా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నిర్మాణ పనులు చేపట్లే సంస్థలు నిర్ధేశించిన గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ జిల్లాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపికచేస్తున్నామని వివరించారు. జిల్లాకు 5,974 గృహాలు మంజూరి కాగా 3,824 గృహాల నిర్మాణానికి స్థలాలను గుర్తించినట్లు వివరించారు. నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని నిర్మాణాల కోసం ఇసుక కొరత ఉత్పన్నం కాకుండా ప్రత్యేక కూపన్‌లు జారీచేసి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. సమీక్ష అనంతరం జిల్లా కేంద్రంలోని గొల్లబజార్, చివ్వెంల మండల పరిధిలోని తిరుమలగిరి, పెన్‌పహాడ్ మండలంలోని సింగారెడ్డిపాలెం గ్రామాల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమాల్లో డిఆర్వో యాదిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రవళిక, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి డిఈ మహిపాల్‌రెడ్డి, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ సంస్థ ఎండి కట్టా వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
రేషన్ అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

నల్లగొండ, : రేషన్ డీలర్లు ఆగస్టు 1 నుంచి సమ్మె చేపడుతున్న నేపథ్యంలో ప్రజలకు రేషన్ సరుకులు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో రేషన్ డీలర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఎంఎల్‌యస్ పాయింట్ ఇన్‌చార్జీలు, హమాలీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ డీలర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నిరసన తెలియజేయాలన్నారు. ఇప్పటికే రేషన్ డీలర్ల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, పరిష్కారం ప్రభుత్వ స్ధాయిలో ఉందని తెలిపారు. ఈ నెల 31లోపు రేషన్ డీలర్లు సరుకులకు సంబంధించి డీడీలు కట్టాలని, లేని పక్షంలో ప్రజలకు సరుకులు అందించేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఎల్‌యస్ పాయింట్ల వద్ద కాంటా వేసుకుని సరుకులు తీసుకెళ్లాలని, తూకంలో తక్కువ వచ్చిన సరుకును వాపస్ చేయాలన్నారు. ట్రాన్స్‌పోర్టర్లు సమ్మె చేసినా ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టర్లను నియమించి సరుకులను తరలిస్తామని చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా జరిగేలా రేషన్ డీలర్లు సహకరించి ప్రజలకు సరైన సమయంలో సరుకులు అందించాలని సూచించారు. రేషన్ కార్డుదారుల ఫోన్ నెంబర్ సేకరించి ఈపిడియస్ సైట్‌లో నమోదు చేయాలని, ఒకవేళ కార్డుదారులకు ఫోన్ నెంబర్ లేకపోతే కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ కానీ, సమీప వ్యక్తుల ఫోన్ నెంబర్ కానీ నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్‌వో ఉదయ్‌కుమార్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ అభిషేక్, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు మల్లారెడ్డి, సత్యనారాయణ, డిప్యూటీ తహశీల్దార్లు, ఎంఎల్‌యస్ పాయింట్ ఇన్‌చార్జిలు, హమాలీలు పాల్గొన్నారు.

పోచంపల్లిని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ బృందం
భూదాన్‌పోచంపల్లి, : పర్యాటక కేంద్రమైన భూదాన్‌పోచంపల్లిని ఏడుగురు ట్రైనీ ఐఏఎస్‌లు గురువారం సందర్శించారు. పోచంపల్లి చేనేత సహకార సంఘం, టూరిజం సెంటర్‌ను సందర్శించారు. చేనేత మగ్గాలు, వస్త్రాల తయారీ విధానం, రంగులు అద్దడం ప్రక్రియలను పరిశీలించారు. కార్మికుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కళాకారుల నైపుణ్యాన్ని కొనియాడారు.
నేడు మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటన
సూర్యాపేట, : రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్‌లో మంత్రి మాతృమూర్తి దివంగత గుంటకండ్ల సావిత్రమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టాటా గ్రూప్ సంస్థలు నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు సూర్యాపేట మండల పరిధిలోని కేటి అన్నారం, సాయంత్రం 5గంటలకు చివ్వెంల మండలం తుల్జారావుపేట గ్రామంలో నిర్వహించనున్న హరితహారం కార్యక్రమంలో పాల్గొనున్నారు.
సాగర్‌లో నాగ చైతన్య సినిమా సందడి
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లో గురువారం తెలుగు సినిమా షూటింగ్ సందడి నెలకొంది. యువహీరో అక్కినేని నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంగా తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను నాగార్జునసాగర్ కొత్తబ్రిడ్జి సాగర్ డ్యాం సమీపంలో చిత్రీకరించారు. విలన్ శ్రీకాంత్‌తో నాగచైతన్య ఫైటింగ్ చేసే దృశ్యాలు, శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసి పోలీస్ జీప్‌లో తీసుకోని వెళ్తున్న సన్నివేశాలను షూటింగ్ చేశారు. ఈసందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణ మాట్లాడుతూ వారాహి చలనచిత్ర బ్యానర్‌పై నాగచైతన్య, లావణ్యత్రిపాఠి హీరో, హీరోయిన్లుగా ఈచిత్రంలో నటిస్తున్నారని, యువ పోలీస్ అధికారిగా నాగచైతన్య, విలన్‌గా శ్రీకాంత్‌లు నటిస్తున్నారని తెలిపారు. వీరితోపాటు రావురమేశ్, మురళీశర్మ మొదలగు నటులు ఈచిత్రంలో ఉన్నారన్నారు. ఈ చిత్రానికి వివేక్‌సాగర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా ప్రొడ్యూసర్‌గా కొర్రపాటి సాయి వ్యవహరిస్తున్నారన్నారు. కాగా నూతన బ్రిడ్జిపై సినిమా షూటింగ్ సందర్భంగా పలుమార్లు తెలంగాణ, ఆంధ్రా వైపు నుండి వచ్చే వాహనాలను నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.
ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్థులు
చింతపల్లి : మండలంలోని కిష్టరాయనిపల్లి గ్రామంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి తరలిస్తున్న ఇసుక లారీలను మండలంలోని గౌరారం గ్రామ పరిధిలోని హరిజనాపురం సమీపంలో గ్రామస్థులు గురువారం అడ్డుకున్నారు. కిష్టరాయనిపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం డిండి మండలం నుంచి ఇసుకను తరలిస్తున్న వాహనాలు సామర్థ్యాన్ని మించి ఇసుకను తరలిస్తుండటంతో గ్రామంలోని రహదారులు ధ్వంసమవుతున్నాయని, వాహనాలు అధిక వేగంతో వెళ్తుండటంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారని గ్రామస్థులు తెలిపారు. రహదారుల నిర్మాణం పటిష్టంగా చేపట్టినట్లయితే గ్రామంలో నుంచి వాహనాలు వెళ్లేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. సామర్థ్యానికి మించి ఇసుకను తరలించడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుకను తరలించే వాహనాలపై ఆర్టీఏ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐ నాగభూషణ్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని సర్దిచెప్పడంతో గ్రామస్థులు వెనుదిరిగారు. దెబ్బతిన్న రహదారులను పునర్నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
పునరావాసాన్ని సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట : గుడుంబా ప్రభావిత కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకొని ఉపాధి కల్పించేందుకు అమలుచేస్తున్న పునరావాస పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో గుడుంబా ప్రభావిత కుటుంబాలకు ఉపాధి కల్పనలో భాగంగా ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక రుగ్మతగా ఉన్న గుడుంబాను నిషేధించడంతో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా నేరుగా ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద గుగులోతు నాగరాజు, బానోతు హరిసింగ్‌లకు రూ. 3.80లక్షల విలువైన రెండు ఆటోలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఎక్సైజ్ పర్యవేక్షకులు శ్రీనివాస్, ఆర్టీవో భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.