నల్గొండ

వృత్తిదారులే పారిశ్రామికవేత్తలవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునుగోడు, జనవరి 18: కుల వృత్తులపై ఆధారపడే ప్రజలంతా పారిశ్రామిక వేత్తలుగా మారాలని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సత్యపంక్షన్ హల్‌లో ఎంబిసి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఏరుకొండ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కుమ్మర సంఘం మునుగోడు నియోజకవర్గ బహిరంగసభకు వారు ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. వృత్తులు వేరైన బిసిలంతా ఒక్కటేనని వారి ఆర్ధికాభివృద్దికి నిరంతరం కృషి చేస్తానని హమి ఇచ్చారు. పార్లమెంట్‌లో బిసిలకు కావల్సిన వాటాపై కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తునట్లు తెలిపారు. అన్ని కులాలకు అనుసందానంగా ఉండేది కుమ్మరి కులమన్నారు. కుమ్మర్లు చేసిన మట్టి పాత్రలో ఏది సేవించిన కమ్మని తీయదనం ఉందన్నారు. ఆ పాత్ర వండే వంట పదార్థాలకు హైద్రబాద్‌లో మంచి ప్రాధాన్యత ఉందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించి మట్టి పాత్రలను వినియోగించాలన్నారు. గత పాలకులు ఓట్ల కోసం ఓట్ల యాంత్రాలుగా ప్రజలను వాడుకునే వారన్నారు. ప్లోరైడ్ బారి నుండి మునుగోడు నియోజకవర్గ ప్రజలను విముక్తి చేసేందుకు ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుంటే అది చూసి ఓర్వలేక కొందరు అడ్డుపడుతున్నా తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. అబివృద్ది నిరోధకులను నియోజకవర్గం నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కుమ్మర సామాజిక వర్గ అబివృద్దికి ఎంబిసి కార్పోరేషన్ ద్వారా 100కోట్లు కెటాయించి గతంలో ఏ ప్రభుత్వం చేయలేని సహసం సిఎం కేసిఆర్ చేశారన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కుమ్మర సంఘం అబివృద్దికి ఎంపి 10లక్షలు, ఎమ్మెల్యే 10లక్షల నిదులతో త్వరలో కమిటి హల్ ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు.ఈ సభలో ఎంబిసి రాష్ట్ర చైర్మన్ తాడూరి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌రెడ్డి, సూర్యపేట మార్కెట్ కమిటి చైర్మన్ యలగందుల వెంకటేశ్వర్లు, కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షులు నడికుడి జయంత్‌రావు, ఎంపిపి మేడి నాగలక్ష్మి, నారాయణపురం జెడ్పిటిసి బొల్ల శివశంకర్, మల్కాజిగిరి దయానంద్, టిఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం సత్యం, మండల పార్టీ అధ్యక్షులు బొడ్డు నర్సింహ్మగౌడ్,నాయకులు రాజమల్లయ్య, వెంకటేశం, రాజకొండ కృష్ణయ్య, నిమ్మనగోని కృష్ణయ్య, బొడ్డుపల్లి రమేష్, బత్తుల కృష్ణయ్య, తదితరులు పాల్గోన్నారు.

ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
కనగల్, జనవరి 18: మండలంలోని పర్వతగిరి గ్రామానికి చెందిన కదిర యాదగిరి(29) గురువారం తన వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ నర్సింహులుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం యాదగిరి పీజీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం నల్లగొండలో కొంత కాలంగా ఉంటూ చదువుతున్నాడు. గత 8 నెలల క్రితమే యాదగిరికి గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన బుమ్మ నీరజతో వివాహం జరిగింది. అయితే నీరజ ఈ నెల 1న పుట్టింటికి వెళ్లింది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న యాదగిరి తోటి విద్యార్థులకు ఉద్యోగం వచ్చి తనకు రాకపోవడంతో మనస్థాపానికి గురై తన స్వగ్రామానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియరాలేదు. మృతుడి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

సమగ్రం.. సకల నేరస్తుల సర్వ్వే!
*జియో ట్యాగింగ్‌తో నేర పరిశోధన వేగవంతం

నల్లగొండ, జనవరి 18: తెలంగాణ పోలీస్ శాఖ పాత నేరస్తుల వివరాల సేకరణ, ఆన్‌లైన్ అప్‌లోడింగ్ చేసేందుకు చేపట్టిన సకల నేరస్తుల సమగ్ర సర్వే కార్యక్రమం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో గురువారం విస్తృతంగా సాగింది. అన్ని మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలో, సర్కిల్, డివిజన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరస్తుల సమగ్ర సర్వేను పోలీస్ సిబ్బంది రోజంతా కొనసాగించారు. హోంగార్డు నుండి ఐజి స్టిఫెన్ రవీంద్ర వరకు పోలీస్ సిబ్బంది సకల నేరస్తుల సర్వేలో నిమగ్నమయ్యారు. పాత నేరస్తుల ఇళ్లకు వెళ్లి వారి ప్రస్తుత నివాసం, ఏ పనిచేస్తున్నారన్న వివరాలను నమోదు చేసి వారి జియోట్యాగింగ్, ఫింగర్ ఫ్రింట్ సేకరణ ప్రక్రియలను నిర్వహించారు. నేరరస్తుల సమగ్ర సమాచార్ని టిఎస్.సివోపి అప్లికేషన్ ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జిల్లా పోలీస్ సిబ్బందికి టాబ్స్ అందించి టిఎస్.సివోపి అప్లికేషన్స్ అనుసంధానం చేసి నిరంతరం నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు నేరం జరిగిన వెంటనే పాత నేరస్తులు ఎక్కడ
ఉన్నారన్నదానిపై విచారణ నిమిషాల్లో పూర్తి చేస్తారు. భువనగిరి, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ, మోత్కూర్, యాదాద్రి, వలిగొండ, చౌటుప్పల్, ఆలేరు, తుంగతుర్తి, కోదాడ, నల్లగొండ, దేవరకొండ, చింతపల్లి, హుజూర్‌నగర్, తిరుమలగిరి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తుల సమగ్ర సర్వే జోరుగా సాగింది. ఐజి స్టిఫెన్ రవీంద్ర, ఎస్పీ డి.వి.శ్రీనివాసరావులు చిట్యాల, మిర్యాలగూడలలో నేరస్తుల ఇళ్లకు వెళ్లి సమగ్ర సర్వే నిర్వహించారు.
నల్లగొండ జిల్లాలో గడిచిన పదేళ్లలో 11,143మంది పాత నేరస్తులను గుర్తించారు. వీరిలో 9057మంది ప్రస్తుతం జిల్లాలో ఉంటుండగా, 2086మంది జిల్లా పరిధిలో నేరాలు చేసి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇతర ప్రాంతాల్లో నేరాలు చేసి జిల్లాలో ఉంటున్న 652మంది పాత నేరస్తులను గుర్తించారు. వీరికి సర్వేకు జిల్లా పోలీస్ సిబ్బందితో 300బృందాలు సకల నేరస్తుల సమగ్ర సర్వే చేపట్టాయి. నేరస్తుల సమగ్ర సర్వే, ఆన్‌లైన్ ప్రక్రియకు వీలుగా 120టాబ్స్‌ను సిబ్బందికి అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే నేరాల విచారణలో సిసి కెమెరాల ప్రాధాన్యత నేపధ్యంలో ఇప్పటికే 823సిసి కెమెరాలు ఏర్పాటు చేయగా మరో 250కెమెరాల నిర్మాణం పురోగతిలో ఉండగా, మరో 1000సిసి కెమెరాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఈ ఏడాది పోలీస్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా తెలంగాణ పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పరిశోధన వేగవంతం దిశగా చేపట్టిన వినూత్న సంస్కరణలు మెరుగైన ఫలితాలు అందిస్తాయని భావిస్తున్నారు.
చిట్యాలలో..
చిట్యాల: నేరాలను చేసిన నేరస్తులను సత్వరం గుర్తించడం ప్రజలకు మెరుగైన భద్రతను కల్పించడం అవసరమైన మేరకు పెట్రోలింగ్‌ను నిర్వహించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను ప్రారంభించామని నేరస్తుల సమగ్ర సర్వేతో నేరస్తుల యొక్క పూర్తి సమాచారాన్ని సేకరిస్తామని ఐజీ ముత్యాల స్టీఫెన్ రవీంద్ర అన్నారు. నేరస్తుల సమగ్ర సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సందర్శించారు. నేరస్తుల సమగ్ర సర్వే ప్రారంభం సందర్భంగా పోలీస్‌స్టేషన్ సమీపంలోని నివాసంలో నివసించే నేరస్తుడి సమాచారాన్ని సేకరించి సర్వేను ఐజీ ప్రారంభించారు. నేరస్తుడి గత నేరసమాచారం, ప్రస్తుత సమాచారం, పూర్తి వివరాలు కుటుంబ వివరాలు బంధు మిత్రుల వివరాలు సెల్‌ఫోన్ నంబర్లు వేలిముద్రలను సేకరించారు. ఇక నుండి సత్‌ప్రవర్తను కలిగి ఉండాలని ఐజీ సూచించారు.
మిర్యాలగూడలో..
మిర్యాలగూడ టౌన్: గురువారం మిర్యాలగూడ పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్‌నగర్‌లో సకల నేరస్థుల సమగ్ర సర్వేను పాత నేరస్థుడు బి.సైదులు ఇంట్లో ప్రారంభించారు. సైదులు చేసిన నేరం వివరాలను సేకరించారు. ఏ నేరం చేశాడో, జమానత్ ఎవరిచ్చారన్న, స్నేహితుల, బంధువుల, పక్కన ఉన్న వారి, న్యాయవాది పేరు వివరాలను సర్వే నమూనాలో సేకరించారు. ప్రస్తుతం ఏ పని చేస్తున్నాడనేది అడిగి తెలుసుకున్నారు. ఒక నేరం అనంతరం ఎలాంటి నేరాలు చేయలేదని సైదులు ఐజీ ముందు తెలిపాడు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పాత నేరస్థుల డాటాను సేకరించి కంప్యూటర్లలో భద్ర పరుస్తామన్నారు. ఉద్యోగాలు, పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారికి వారి వివరాలను తెలియజేయమన్నారు.