నల్గొండ

గ్రామీణ గ్రంథాలయాల అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రంథాలయాల సంస్థ జిల్లా అధ్యక్షుడు అల్లం ప్రభాకర్‌రెడ్డి
చిట్యాల, మార్చి 6: గ్రామీణ ప్రాంతాల్లోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషిచేస్తామని గ్రంథాలయాల సంస్థ జిల్లా అధ్యక్షుడు అల్లం ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని వెలిమినేడు గ్రంథాలయానికి నాతి లక్ష్మినర్సింహ ఫౌండేషన్ ద్వారా బహుకరించే పుస్తకాలను అల్లం ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి సుక్లాదేవితో కలిసి స్థానిక గ్రంథాలయానికి పుస్తకాలను అందజేశారు. ఈసందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాల్లో గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయికి సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని రాబోయే రోజుల్లో విద్యార్థులకు యువతకు అవసరమయ్యేటటువంటి పోటీపరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రంథాలయాలకు విలువైన పుస్తకాలను అందించి దాతలు సహకరించాలని రాబోయే తరాలకు గ్రంథాలయాల్లో విలువైన విజ్ఞానాన్నందించేందుకు దోహదపడాలన్నారు. గ్రంథాలయాల్లో సాంకేతికత పరిజ్ఞానాన్ని కూడా అందించేందుకు కృషిచేస్తున్నామని పాఠకులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వెలిమినేడు గ్రంథాలయాన్ని గ్రామ గ్రంథాలయంగా గుర్తించేందుకు అవసరమైనటువంటి చర్యలను తీసుకుంటామని అందుకు తన వంతుగా కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో గ్రామ ఎంపిటిసి సభ్యులు నెలికంటి నర్సింహ, అర్రూరి శ్రీనివాస్, గ్రంథాలయ నిర్వాహకుడు పబ్బు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.