విశాఖపట్నం

ఆకాశమే హద్దుగా ఐటీ ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 26: రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగం బలోపేతం కాబోతోందని, ఈ రంగంలో ఆకాశమే హద్దుగా ఉద్యోగావకాశాలు ఉండబోతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విన్నీ పాత్రో తెలియచేశారు. గురువారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిశ్రమలకు, విద్యా సంస్థలకు మధ్య సమన్వయ లోపం ఉందని అభిప్రాయపడ్డారు. ఏయే పరిశ్రమలకు ఏ రంగంలో శిక్షణ పొందిన అభ్యర్థులు కావాలన్న విషయాన్ని ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారని ఆయన చెప్పారు. అందువలన విద్యార్థులు చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాలు రావడం లేదని అన్నారు. 2000 సంవత్సరంలో వైటూకే సమయంలో ఐటీ రంగంలో అనేక మందికి ఉద్యోగాలు లభించాయి. గడచిన ఆరేళ్లలో కంపెనీలు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అనూహ్యంగా పెంచుకున్నాయి. అయితే, విద్యా సంస్థలు ఈకొత్త కంపెనీల వైపు దృష్టిపెట్టడం లేదు. ఉద్యోగావకాశాలు ఉన్నా, విద్యార్థులు వాటి గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ఏపీఐటీఏ కంపెనీలు, విద్యా సంస్థల మధ్య సమన్వయం కుదిర్చేందుకు కార్యాచరణను రూపొందించిందని పాత్రో వివరించారు. కొత్త కంపెనీలను కాలేజీకి ఎలా పరిచయం చేయాలన్నది ఇప్పుడు మా ముందు ఉన్న లక్ష్యం. కొత్త కంపెనీలకు వెళ్లి, ఐటీ రంగంలో సుశిక్షితులైన విద్యార్థులు ఉన్నారని చెప్పి, వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతున్నాం. మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఓరియంటేషన్ ఇచ్చి కంపెనీ ముందుకు తీసుకువెళుతున్నామని విన్నీ చెప్పారు. ఇక్కడి విద్యార్థుల్లో టాలెంట్‌ను కంపెనీ యాజమాన్యాలు గుర్తించడంతో, పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని ఆయన తెలియచేశారు.
ఆరు నెలల కిందట విశాఖలో మెగా జాబ్‌మేళా ప్రారంభించాం. విజయవాడలో ఐదు కళాశాలల్లో జాబ్‌మేళా నిర్వహిస్తే 50 కంపెనీలు వచ్చాయి. తిరుపతి జాబ్‌మేళాకు 77 కంపెనీలు హాజరై సుమారు 1400 మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. ఇక్కడ జరిగిన జాబ్‌మేళాలో ఇండిగో ఎయిర్‌లైన్స్ పాల్గొనడం గమనార్హం. అనంతపురంలో జాబ్‌మేళాలో కూడా ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్, పేటీఎం, ఫ్లిప్‌కార్డ్, బైజూస్ కంపెనీ వచ్చాయి. ఇన్ఫోసిస్ మన రాష్ట్రంలో 443 మందిని రిక్రూట్ చేసుకుందని పాత్రో పేర్కొన్నారు. ఏపీఐటీఏ ప్రస్తుతం 250 కళాశాలలతో క్లోజ్‌గా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. విశాఖలో బ్లాక్ చైన్ కంపెనీస్‌ను తీసుకువచ్చామని, దీంతో నాలుగు లక్షల 20 లక్షల ప్యాకేజీలతో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పారు. గడచిన ఆరు నెలల్లో 5,561 ఐటీ రంగంలో ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పారు. వీరికి కనీసం నెలకు 1.25 లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల ప్యాకేజీ వచ్చిందని విన్నీ తెలియచేశారు. 20 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన తక్కువగా ఉంది. వీరికి ఇండస్ట్రియల్ లెవెల్ థింకింగ్ రాలేదు. దీనివలన వారు ఎటువైపు వెళ్లాలన్నది తెలుసుకోలేకపోతున్నారు. ఇందుకోసమని హ్యాకథాన్ నిర్వహిస్తున్నాం. విద్యార్థి టీచర్లు చెప్పేది వింటున్నాడు. పుస్తకాల్లో ఉన్నది చదువుతున్నాడు. కానీ ప్రాక్టికాలిటీ లేదు. ఈ హ్యాకథాన్ విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ఆలోచనాశక్తిని బయటకు తెస్తుంది. సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, డేటా సైన్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లను విద్యార్థుల ముందుంచి, వాటిని పరిష్కరించేలా వారిని ప్రోత్సహిస్తున్నామని విన్నీ వివరించారు. ఒక సవాలును పరిష్కరించగలితే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతంది. దీంతో వారి ఆలోచనా విధానం మారిపోతుంది. త్వరలోనే డిజిటల్ ఎడ్యుకేషన్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. దీనికి డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు, యూనివర్శిటీల ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్‌ను, చైర్మన్స్‌ను, ప్రొఫెసర్స్, పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాం. పారిశ్రామిక అవసరాలను యాజమాన్యాలు వీరికి తెలియచేస్తాయి. ఆ దిశగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు శిక్షణ ఇస్తారని అన్నారు. దీంతో రెండు, మూడు సంవత్సరాల్లో ఐటీ రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తాయని, ప్రపంచానికి మన విద్యార్థులు రోల్‌మోడల్‌గా నిలుస్తారని ఆయన తెలియచేశారు.