విశాఖపట్నం

బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 21: వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి నుంచి బలోపేతం కావాలని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ కోస్తా రీజియన్ ఇన్‌ఛార్జి క్రిష్ట్ఫోర్ తిలక్ అన్నారు. నగర పార్టీ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ పరిధి అసెంబ్లీ సెగ్మెంట్‌ల ఇన్‌ఛార్జిలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్డులు, మండలాల్లో పార్టీ కేడర్ సమర్ధవంతంగా పనిచేస్తే విజయం కష్టమేమీ కాదన్నారు. బూత్ కమిటీల నియామకాన్ని సత్వరమే చేపట్టాలని, అనంతరం వార్డు కమిటీ ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. ఇటీవల రాష్ట్రంలో ఏఐసీసీ అధ్యక్షుని పర్యటన విజయవంతం కావడమే అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ ద్రోహం చేసిందని, టీడీపీకి సైతం దీనిలో భాగం ఉందని ఆరోపించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే కాంగ్రెస్‌కు పూర్వవైభవం తప్పనిసరిగా వస్తుందన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపి టీడీపీ, బీజేపీలు లబ్ధిపొందాయన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అంగీకరించి పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా ఇస్తామన్న బీజేపీ, పదిహేనేళ్లు హోదా ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేశాయన్నారు. గెలిచిన తరువాత హోదాపై దొంగనాటకాలాడాయన్నారు. గత నాలుగేళ్లుగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కర్నూలులో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, ఇదే స్ఫూర్తితో రాహుల్ విశాఖ రప్పించాలన్నారు.
ముందుగా ఏఐసీసీ కార్యదర్శి క్రిష్ట్ఫోర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కర రావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రమణికుమారి తదితరులు విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో కొంతసేపు పాదయాత్ర చేశారు. అనంతరం విశాఖ పార్లమెంట్ పరిధిలోని పెందుర్తి, భీమిలి, గాజువాక, విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు వుడా రవి, మంత్రి రాజశేఖర్, గంపా గోవింద్, సోడాదాసు సుధాకర్, కె వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.