నల్గొండ

నిమ్స్‌లో వైద్యసేవలు విస్తరిస్తాం: లక్ష్మారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీబీనగర్, ఏప్రిల్ 19: నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం రంగాపురం నిమ్స్ ఆసుపత్రిలోవైద్యసేవలను విస్తరిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం నిమ్స్ హాస్పిటల్‌ను మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించి వైద్యచికిత్స విభాగాలను పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతు నిమ్స్‌లో గైనకాలజి, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ విభాగాలతోపాటు కార్డియాలజి, న్యూరాలజీ, యూరాలజీ విభాగాలలో అత్యవసర సేవలను విస్తరిస్తామని తెలిపారు. నిమ్స్‌ను ప్రారంభించిన నాటినుండి నేటివరకు నెలరోజుల కాలంలో 19వందల మందిరోగులకు వివిద రకాల చికిత్సలు నిర్వహించినట్లుగా ఆయన తెలిపారు. భవన నిర్మాణం పూర్తయిన వెంటనె మూడునెలల్లో ఇన్‌పేషెంట్ విబాగాలను ప్రారంభిస్తామన్నారు. భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టరును ఆదేశించారు. అదేవిదంగా భవన నిర్మాణం పూర్తయినవెంటనె పిజి కళాశాలను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. పేదప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించడానికె తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హాస్పిటల్‌కు వచ్చె రోగులకు ఇబ్బంది కలుగకుండా జాతీయరహదారిపై బస్టాప్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి సూచించారు. నిమ్స్ హాస్పిటల్‌లో అందుతున్న వైద్యసేవలపట్ల రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వచ్చంద సంస్థల ఆర్ధిక సహాయంతో ఏర్పాటుచేసిన ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్‌ను మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఆయన వెంట ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, డిప్యూటి డైరెక్టర్ కెటి.రెడ్డి, మాజి ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహ్మరెడ్డి, ఎంపిపి గోళి ప్రణితాపింగల్‌రెడ్డి, జడ్పిటిసి సందిగారి బస్వయ్య, ఎంపిటిసి మంచాల రవికుమార్, మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల అశోక్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చెంగల వెంకటకిషన్‌రావ్, ఎరుకల సుధాకర్‌గౌడ్, బొక్క జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
పూర్తి వైద్య సేవలందించాలి: టిడిపి
బీబీనగర్ రంగాపురం నిమ్స్ ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యసేవలందించాలని మంత్రి లక్ష్మారెడ్డికి టిడిపి మండల పార్టీ అధ్యక్షులు సురకంటి జంగారెడ్డి ఆద్యర్యంలో వినతిపత్రం అందజేసారు. ఈకార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మెన్ వాకిటి సంజీవరెడ్డి, బద్దం బిక్షపతి, మనె్న సంజీవరావ్, ఎండి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
డాకర్లు సమయపాలన పాటించాలి
బీబీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మంగళవారం నిమ్స్‌కు విచ్చేసిన మంత్రి లక్ష్మారెడ్డికి కలిసిన ప్రజాప్రతినిధులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై పిర్యాదుచేశారు. ఈసందర్భంగా వైద్యసిబ్బందిని పిలిచి మంత్రి లక్షారెడ్డి మందలించిన అనంతరం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తె క్రమశిక్షణాచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.