నల్గొండ

నేడు ఎడ్‌సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, మే 26: జిల్లా కేంద్రంతోపాటు సూర్యాపేటలో శుక్రవారం ఎడ్‌సెట్ 2016ప్రవేశ పరీక్ష జరగనుంది. అందుకుగాను అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. నల్లగొండలో 8పరీక్షా కేంద్రాలు, సూర్యాపేటలో 6పరీక్షా కేంద్రాల ద్వారా 4318మంది విద్యార్థులు ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షకు హాజరు కానున్నారు. నల్లగొండలో ప్రభుత్వ మహిళా కళాశాలలో 600మంది విద్యార్థులు, ఎన్జీ కళాశాలలోని ఎబి కేంద్రాలలో 500మంది, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 256మంది. డైట్ కళాశాలో 228మంది, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 378మంది, సెంట్ ఆల్ఫనె్సస్ హైస్కూల్‌లో 500మంది, ప్రభుత్వ బాలుర ఐటిఐ కళాశాలలో 116మందితో కలిపి 3088మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నారు. సూర్యాపేటలో 6పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జడ్పీహెచ్ హైస్కూల్, జడ్పీహెచ్‌ఎస్ టూ హై స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హిమామ్‌పేట్ ప్రభుత్వ మోడల్ హైస్కూల్‌తో కలిపి మొత్తం 1230మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్ష ఉదయం 11గంటల నుండి 1గంటల వరకు జరగనుంది. గంట ముందే పరీక్షా హాల్‌లోకి అనుమతించనున్నారు. మార్చి 14నుండి మే 14వరకు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకుని ఉండి హాల్‌టికెట్ రాని అభ్యర్థులు ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకున్న నమూనా, ధ్రువపత్రాలను ఆధారంగా చూపడంతోపాటు, ఐడి కార్డు, రెండు పాస్‌ఫోటోలతో సమీప కోఆర్డినేటర్‌ను సంప్రదించినట్లయితే ఎడ్‌సెట్ రాయడానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఎడ్‌సెట్ నిర్వహకులు తెలిపారు. పరీక్షాహాల్‌లోకి వచ్చేటపుడు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని, పరీక్ష సమయం తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని నల్లగొండ, సూర్యాపేట కో ఆర్డినేటర్లు సందీప్‌రెడ్డి, సాల్మన్‌రాజు, రణదీప్‌లు పేర్కొన్నారు.