నల్గొండ

ఎసిబి వలలో పంచాయతీ కార్యదర్శి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట అర్బన్, 31: ఇంటినంబర్ కోసం లంచం తీసుకుంటు ఏసిబి అధికాలకు రెడ్‌హ్యాండడ్‌గా చిక్కిన పంచాయతీ కార్యదర్శి ఉదంతం ఇది. మంగళవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఏసిబి డిఎస్పీ సూర్యనారాయణ విలేఖరులతో మాట్లాడారు. సిద్దిపేట మండలం తడ్కపల్లి పంచాయతీ కార్యదర్శి ఎస్. బాల్‌రాజ్ దండు శంకరయ్య ఇంటి నంబర్ కోసం 5వేలు లంచం డిమాండ్ చేయగా 4వేలకు ఒప్పందం చేసుకున్నాడు. గ్రామ హరిజనవాడలోని ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించారు. తన భూమిలో పాఠశాల నిర్మించారని శంకరయ్య కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం శంకరయ్యకు తీర్పు అనుకూలంగా వచ్చింది. ఇంటికి మీటరు అవసరం కావడంతో గతంలో మీటర్ పాఠశాల పేరుమీద ఉండడంతో తన ఇంటి నంబర్ కోసం ఈనెల 18న పంచాయతీ కార్యదర్శి ఎస్. బాల్‌రాజ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. పలుమార్లు తిరిగినా ఇంటి నంబర్ ఇవ్వకపోవడంతో 5లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా 4వేలకు ఒప్పందం చేసుకున్నాడు. దీని పై శంకరయ్య కుమారుడు శ్రీనివాస్ ఈనెల 30న ఏసిబిని ఆశ్రయించాడు. మంగళవారం గజ్వేల్‌లోని ఓ హోటల్‌లో శ్రీనివాస్ 4వేలు డబ్బులు ఇస్తున్న క్రమంలో ఏసిబి అధికారులు పట్టుకున్నారు. బాల్‌రాజ్‌ను అక్కడి నుంచి తడ్కపల్లికి తీసుకొచ్చి విచారణ అనంతరం సిద్దిపేట ఎంపిడిఓ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం స్వాధీనం చేసుకున్న డబ్బులు, బాల్‌రాజ్‌ను విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. ఎంపిడిఓ సమ్మిరెడ్డి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శిగా బాల్‌రాజు 20్ఫబ్రవరి 2015లో తడ్కపల్లిలో బాధ్యత చేపట్టారన్నారు. అంతకుముందు జగదేవ్‌పూర్ మండలం శివానందపూర్‌లో కార్యదర్శి పని చేశాడన్నారు. శివానందపూర్‌లో పంచాయతీ నుంచి డబ్బులు అడ్వాన్స్‌గా తీసుకోవడంతో అధికారులు ఎల్‌పిసి ఇవ్వలేదని, దీంతో వేతనం రాలేదని తెలిపారు. బాల్‌రాజ్ నారాయణరావుపేట, లక్ష్మిదేవిపల్లి, మిట్టపల్లి గ్రామాలకు ఇంచార్జీగా వ్యవహరిస్తున్నాడన్నారు. ఈ దాడులు ఏసిబి సిఐ నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.