నల్గొండ

నాణ్యమైన విద్య కోసమే.. ప్రైవేటు కళాశాలలపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, మే 31: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాటిపై కొరడా ఝలిపించడం జరుగుందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో అదనపు తరగతి గదులను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విద్యావ్యవస్థలో మా ర్పులు తేవడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ కళాశాలల ఫీజుల జులుంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే తెరాస ప్రభుత్వ పాలన ఉంటుందన్నారు. తెలంగాణ ప్రాం తంలో గతంలో ఏ ప్రభుత్వాలూ చేయని చెరువు మరమ్మతు పనులను రైతుల కోసం లక్షల కోట్ల నిధులతో చేస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువు పనులు పూర్తి చేసి, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి వర్షం చినుకునూ ఒడిసి పట్టుకోవాలని సూచించారు. తెలంగాణ ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నందున ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 14 సంవత్సరాల పోరాటంతో సాదించిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రతి మండల కేంద్రంలో నిర్వహిస్తామన్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా బోనం ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో అమ్ముతున్న ఢమరుకం, గాజులు, కొనుగోలు చేసి సందడి చేశారు. ఆలయ కమిటీ సభ్యులు పద్మాదేవేందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. అంతకు ముందు పార్టీ జెండావిష్కరించారు. యాదవ సంఘ కమిటీ హాల్ చిన్నదిగా ఉండడంతో మరింత పెద్దగా నిర్మించేందుకు నిదులు మంజూరు చేస్తానన్నారు. ఆమె వెంట ఎంపిపి పుట్టి విజయలక్ష్మీ యాదగిరి, జడ్పీటిసి బిజ్జ విజయలక్ష్మీ సంపత్, వైస్ ఎంపిపి జితెందర్‌గౌడ్, సర్పంచులు పాతూరి ప్రభావతి, గన్నారం భవానీ వెంకట్‌గౌడ్, బాజ సిద్దరాములు, రామకిష్టయ్య, సంగు స్వామి, ఎంపిటిసిలు స్వామి, వెంకట్‌స్వామి, నాయకులు పుట్టి యాదగిరి, అందె కొండల్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, బాదె చంద్రంతో పాటు తదితరులు పాల్గొన్నారు.