నల్గొండ

మైనార్టీ బాలికల పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపిక పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, మే 31: మిర్యాలగూడ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మైనార్టి ఆశ్రమ బాలికల పాఠశాలలో 5, 6, 7 తరగతులకు వచ్చిన దరఖాస్తు దారులను డ్రా ద్వారా ఎంపిక చేసే ప్రక్రియను డిప్యూటి డిఇఓ డి.పాండునాయక్, తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, ఎంఇఓ చంప్లానాయక్‌లు మంగళవారం పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టి ముస్లింలు పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 5, 6, 7 తరగతుల్లో ముస్లింలకు 80 చొప్పున సీట్లు ఉండగా 67, 67, 64 దరఖాస్తులు, సిక్కులకు ఒకటి కాగా ఒకటి, బుద్ద, జైను, పార్సీలకు ఒకొక్కటి, క్రైస్తవులకు 2 చొప్పున కాగా క్రైస్తవులు, సిక్కులు ఒకొక్కటి దరఖాస్తు చేసుకున్నారు, వేరే మైనార్టిలు దరఖాస్తు చేసుకోలేదు. అదే విధంగా 5, 6, 7 తరగతుల్లో నాన్ మైనార్టి కోటాలో ఒకొక్క తరగతిలో ఎస్‌సిలో 2కు , ఎస్‌టిలో 2కు , ఓసి 1, బిసిలకు 5 కాగా మంది దరఖాస్తు చేసుకున్నారు. మూడు తరగతులకు గాను ఎస్‌సిలు 271, ఎస్‌టిలు 313, ఓసిలు 20, బిసిలు 383, దరఖాస్తు చేసుకున్నారు. మైనార్టి సీట్లకు పోటీ లేకపోగా, నాన్‌మైనార్టి సీట్లకు పోటీ ఉండటంతో డ్రా తీయడం జరిగింది. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జలీల్‌అహ్మద్, ముఫ్తీ మహ్మద్ అమానుల్లా ఖాస్మీ, షాదీఖానాకమిటి చైర్మన్ హఫీజుద్దీన్‌పాషా, టిఆర్‌ఎస్ నాయకులు ఎండి.్ఫహీముద్దీన్, ఎండి.హబీబ్, వౌజంఅలి, ఎండి.రఫీక్‌లు పాల్గొన్నారు.