విశాఖపట్నం

ప్రత్యేక హోదా... ప్రజల ఆకాంక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 2: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. రాష్ట్ర విభజన వల్ల బాధపడటం కన్నా కసి, పట్టుదలతో అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. నవ నిర్మాణ దీక్షను గురువారం ఇక్కడి ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద నిర్వహించారు. అక్కడ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం రాష్ట్రాన్ని విభజించారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. విభజన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించిన తీరు అందరికీ గుర్తుండే ఉంటుందన్నారు. ఆ ఘటన గుర్తుకు వస్తే బాధ కలుగుతుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు నాయకులు మరిచిపోయారన్నారు. ప్రత్యేక హాదా అంటే ఏమీటో తెలియకపోయినా ప్రజలు కావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రానికి అప్పులు, తెలంగాణకు ఆస్తులు పంచారన్నారు. రాజధాని, సిఎం కార్యాలయం, అధికారులకు సరైన కార్యలయాలు వంటి సదుపాయాలు లేవన్నారు. ఆర్థిక, పాలనాపరమైన ఇబ్బందులు ఉన్నా, ముఖ్యమంత్రి రాష్ట్భ్రావృద్ధికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రజలు సహకరించాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రానికి అపారమైన వనరులు ఉన్నాయని, వీటిని ప్రణాళిక ద్వారా సద్వినియోగం చేసుకోవాల్సి ఉందన్నారు. రైల్వే జోన్‌ను గత 35 సంవత్సరాలుగా ఇస్తామంటూ కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. సాధించుకోవాల్సి ఉందని, పోలవలంతో ఉత్తరాంధ్ర నీటి సమస్య తీరుతుందని తెలిపారు. రాష్ట్రంలో 13 వేల పంచాయతీల్లో దాదాపు 5000 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. విడిపోయిన రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాల ఆదుకుంటుందని, విడిపోయామని, నష్టపోయామన్న మాటలు మరచిపోదామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి కె.హరిబాబు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకుంటూ పని చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రత్యేక హాదా, రైల్వే జోన్, రెవెన్యూలోటు, పోలవరం వంటి అంశాలను మిగిలిన మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేసుకోవాలన్నారు. నగరంలో శాంతి భద్రతలు సమస్యగా మారుతోందన్నారు. భూ ఆక్రమణలు పెరుగుతున్నాయని, వాటిని ఉక్కుపాదంతో అణచాలని సిపి యోగానంద్‌కు సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఇందుకు సహకరిస్తామన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలపై దృష్టి సారించాలని కలెక్టర్‌కు ఆదేశించారు. ప్రమాదాలు తక్కువన్న గుర్తింపు తీసుకురావాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర జిడిపిలో విశాఖ వాటా 12 శాతం ఉందని, ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి మాట్లాడుతూ అశాస్ర్తియంగా, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. పార్లమెంట్ తలుపులు మూసి ఆ అరగంట ఏమి జరిగిందో తెలియకుండా కాంగ్రెస్ విభజన చేసిందన్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ విభజన తీరు బాధగా ఉన్నా, ముఖ్యమంత్రి రాష్ట్భ్రావృద్ధికి చేపడుతున్న చర్యల్లో భాగస్వాములం అవుదామని, సంఘీభావం తెలియచేద్దామన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లాలం భవానీ, జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్, వుడా వీసీ టి.బాబూరావు నాయుడు, నగర పోలీస్ కమిషనర్ యోగానంద్, మెరైన్ ఐజి సూర్య ప్రకాశరావు, డిఐజి జి.శ్రీకాంత్, ఎస్పీ రాహుల్ దేవ శర్మ, జెసి-2 డి.వి.రెడ్డి, డిఆర్వో చంద్రశేఖర రెడ్డి, జెడ్పీ సిఇఒ జయప్రకాశ్ నారాయణ, డ్వామా పిడి శ్రీరాములునాయుడు, డిఎంహెచ్‌ఒ సరోజిని, మున్సిపల్ ఆర్‌డి ఆషాజ్యోతి, ఉద్యోగ సంఘాల జెఎసి ప్రతినిధి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా వచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో చేసిన నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వింటూ ప్రతిజ చేశారు. కాగా మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేద్దామని భావించినా, సమయా భావం వల్ల కళాశాల ఎదుట నిలబడి ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో నర్సింగ్ విద్యార్థినులు రావడం కనిపించింది. ఈ సమసయంలో ఆర్డీసీ బస్సులు సహా ఇతర వాహనాలు యథావిధిగా నడవడం కనిపించింది.