విశాఖపట్నం

ఎయు పాలకమండలి సమావేశానికి ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 2: ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశాన్ని నిర్వహించే అంశంపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎయు బడ్జెట్ సమావేశం తరువాత జూన్ నెలాఖరులోగా పాలకమండలి సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రతిపాదించారు. తేదీ నిర్ణయం, అజెండా అంశాల ఖరారు తదితర అంశాలపై కొంతమంది పాలక మండలి సభ్యులు గురువారం రిజిస్ట్రార్ ఉమా మాహేశ్వరరావుతో సమావేశమయ్యారు. అజెండాలో చేర్చాల్సిన అంశాలపై చర్చించారని తెలిసింది.

వేతనాలు చెల్లించాలి
విశాఖపట్నం, జూన్ 2: నైట్ మాపింగ్ కార్మికుల బకాయి వేతనాలు ఎస్‌ఎల్‌ఎఫ్ ద్వారా వెంటనే చెల్లించాలని కోరుతూ గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ప్రతినిధి పి.వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని గతంలో హామీనివ్వడం జరిగింది. కానీ శుభ్రం కార్మికులకు బిల్లు పెట్టకపోవడంతో రెండు మాసాల నుంచి వేతనాలు నిలిపివేశారన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, టి.నూకరాజు పాల్గొన్నారు.