విశాఖపట్నం

ఫీజుల పెంపు రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 2: ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యాలతో కుమ్మక్కైందని సిపిఎం కార్యదర్శి డాక్టర్ బి.గంగారావు విమర్శించారు. సిపిఎం కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీజుల పెంపును రద్దు చేసి, పాత ఫీజులనే కొనసాగించాల్సిందిగా కోరారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఇచ్చిన సమాచారం పూర్తిగా అక్రమాలపుట్టగా పేర్కొన్నారు. దీనిని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం మొత్తం 309 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకుగాను 174 కళాశాలలకు ఏ గ్రేడు 117కి బి గ్రేడ్, 18కి సి గ్రేడ్ కేటాయించారన్నారు. ఇప్పటి వరకు ఉన్న డిగ్రేడ్‌ను తొలగించారన్నారు. గత ఏడాది ఏ గ్రేడ్‌లో 45, బిలో 104, సిలో 62, డి గ్రేడ్‌లో 33 కళాశాలలు ఉండేవన్నారు. గత ఏడాది 35 వేల ఫీజు గల కళాశాలల సంఖ్య 220కి పైగా ఉన్నాయన్నారు. ఇపుడు ఈ సంఖ్యను 66కి కుదించారన్నారు. ఈ 154 కళాశాలల ఫీజులు 40 వేల నుండి 60 వేలకు పెంచారని, 60వేల నుండి లక్ష వరకు ఫీజు అర్హత కలిగినవిగా 50 కాలేజీలుగా ప్రతిపాదించారన్నారు. గత ఏడాది సీట్లు భర్తీ, పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం, పరిశ్రమల్లో శిక్షణ, ఎన్‌బిఏ గుర్తింపు ప్రాంగణ నియామకాలు సమాచారం ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చాయని, ఈ సమాచారం పూర్తిగా అక్రమాలు, అవాస్తవాలతో కూడుకున్నదిగా పేర్కొన్నారు. ప్రైవేటు యాజమాన్యాలు సమర్పించిన సమాచారం విశ్వనీయతపై ప్రభుత్వం ఎటువంటి తనిఖీ జరుపలేదని, వాస్తవంగా ప్రభుత్వమే ఉన్నతాధికరాలతో కమిటీ వేసి గ్రేడ్‌లు నిర్ణయించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ‘నాక్’ బృందం తనిఖీ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అత్యధిక భాగం పార్టీలకు చెందిన నాయకులవేనన్నారు. ప్రభుత్వం పునరాలోచించి ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు పెంపు విరమించుకోవాలన్నారు. ప్రైవేటు కళాశాలలు సమర్పించిన కీ ఫెర్మార్మెన్స్ ఇండికేటర్స్‌పై ఉన్నాతాధికరాలతో సమగ్ర దర్యాపు జరిపించాలని డిమాండ్ చేశారు. పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి కుమార్ పాల్గొన్నారు.