నల్గొండ

కేసుల సత్వర పరిష్కారం దిశగా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, జూన్ 3: సమస్యలు ఇబ్బందులు ప్రమాదాలకు సంబంధించిన కేసులను సత్వరం పరిష్కారం జరిగేలా ఎస్‌ఐలు, సిబ్బంది ఆదిశగా పనిచేయాలని జిల్లా ఎస్‌పి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం సాయంత్రం ఎస్‌పి ప్రకాశ్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానిక స్టేషన్, సిబ్బంది, మండలానికి సంబంధించిన వివరాలను చౌటుప్పల్ రూరల్ సిఐ శివరాంరెడ్డి, స్థానిక ఎస్‌ఐలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ తగాదాలు సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పరిష్కారం కోసం కృషిచేయాలన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడం ప్రధానకర్తవ్యమని సిబ్బంది శాంతిభద్రతలపై దృష్టిని సారించాలన్నారు.
రహదారిపై ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనాలు జరుగకుండా ఉండేందుకు సిబ్బంది గస్తీ తిరగాలని పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలన్నారు. ఎస్‌పి వెంట ఎస్‌ఐలు శివకుమార్, దేవేందర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
అంతకు ముందు ఎస్పీ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.