నల్గొండ

కాంగ్రెస్ సీనియర్లు పరస్పర విమర్శలు మానాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 3: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పరస్పరం విమర్శలు మానుకుని హుందాగా వ్యవహారించి పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించాలని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో సిఎల్పీ నేత కె.జానారెడ్డి ఐదు రూపాయల భోజనం బాగుందంటు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ఓటమికి దారితీశాయంటు కాంగ్రెస్ మాజీ ఎంపి సర్వే సత్యనారాయణ తాజాగా మరోసారి విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. జానా మాటలే పార్టీ ఓటమికి కారణమైతే వరంగల్ సహా ఇతర ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిందో సర్వే చెప్పాలన్నారు.
ఏపి సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లయినా ఇంకా విభజన ప్రక్రియ మోసపూరితమంటు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్‌ను నిందించడం సిగ్గుచేటన్నారు. కేవలం తన రెండేళ్ల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు విభజన ప్రక్రియపై ఇంకా రాజకీయ విమర్శలు చేస్తున్నారంటు గుత్తా ఎద్దేవా చేశారు. శ్రీకృష్ణ కమిటీ, చిదంబరం కమిటీ అఖిల పక్ష సమావేశాల ద్వారా రాష్ట్ర విభజన అభిప్రాయ సేకరణ చేసిన సంగతి చంద్రబాబు మరిచిపోవడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ ఎపి ఎంపిలు వ్యతిరేకించినా సోనియాగాంధీ లెక్క చేయకుండా ప్రజాభిప్రాయాన్ని అనుసరించి తెలంగాణ ఏర్పాటు చేసిందన్నారు. అదే టిడిపి ఎంపిలను ప్రాంతాల వారిగా వ్యవహరించేలా చంద్రబాబు ప్రొత్సహించి విభజన పర్వంలో రాజకీయ లబ్ధి కోసమే వెంపర్లాడారంటు గుత్తా విమర్శించారు. విభజన మోసపూరితమైతే అందుకు మద్ధతునిచ్చిన బిజెపితో నేడు ఎందుకు టిడిపి మిత్రపక్షంగా వ్యవహరిస్తుందో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని గుత్తా నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంకు వ్యతిరేకంగా చంద్రబాబు తన కుట్రలు కొనసాగిస్తునే పాలమూరు-డిండి ఎత్తిపోతలను వ్యతిరేకిస్తున్నాడని దీనిని టి.కాంగ్రెస్ నిరసిస్తుందని ఆ ప్రాజెక్టుల పూర్తికి తెలంగాణ ప్రభుత్వానికి తమ సహకారం అందిస్తుందన్నారు. యాదాద్రి ధర్మల్ పవర్ ఫ్లాంట్ నిర్వాసితుల పరిహారంపై తాను, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావుతో కలిసి సీఎం కెసిఆర్‌ను గురువారం సాయంత్రం కలిశామన్నారు. ప్రజాభిప్రాయం సాఫీగా సాగడం పట్ల కెసిఆర్ సంతృప్తి వ్యక్తం చేస్తు నిర్వాసితులకు పరిహారం, ఉద్యోగ అవకాశాల కల్పనకు అంగీకరించారని గుత్తా వెల్లడించారు.
అలాగే మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సూర్యాపేటలో కాకుండా నల్లగొండ జిల్లాలో కొనసాగించాలని సీఎంను కోరడం జరిగిందన్నారు. దేవరకొండ, మునుగోడులకు కృష్ణా నీరందించే డిండి ఎత్తిపోతల పథకానికి నార్లపూర్ నుండి నీరందించాలని నిర్ణయించినట్లుగా సీఎం తెలిపారన్నారు. టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న ప్రచారంపై గుత్తా స్పందిస్తు తాను ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో కొనసాగుతానని భవిష్యత్‌లో టిఆర్‌ఎస్‌లో చేరే విషయమై ఇప్పుడు చెప్పలేనంటు దాటవేశారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరిక ప్రచారంపై గుత్తా స్పందిస్తు ఎవరి వ్యక్తిగత అభిప్రాయల మేరకు వారు నడుచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. ఈ సమావేశంలో డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పాశం రాంరెడ్డి, జడ్పీటీసి శంకర్‌నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, డిసిసి ఉపాధ్యక్షులు మునాస వెంకన్నలు ఉన్నారు.